Ys Sharmila Deeksha: తెలంగాణలో వైఎస్ షర్మిల దీక్షకు ఆ నేతల మద్దతు లభించేనా
Ys Sharmila Deeksha: తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన. ఉద్యోగుల భర్తీ డిమాండ్‌తో ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. మరి షర్మిల దీక్షకు ఎవరెవరి మద్దతు లభించనుందనేది ఆసక్తిగా మారింది.
Ys Sharmila Deeksha: తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన. ఉద్యోగుల భర్తీ డిమాండ్‌తో ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. మరి షర్మిల దీక్షకు ఎవరెవరి మద్దతు లభించనుందనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ కలకలం కల్గిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్( Ysr) తనయ వైఎస్ షర్మిల( Ys Sharmila) తెలంగాణ( Telangana)లో కొత్త రాజకీయ పార్టీకు సన్నాహాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో దిగడం కాదు గానీ..అందర్నీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించగలరు. ఒక్కోసారి ఒంటరిపోరు లాభిస్తే..కొన్నిసార్లు పొత్తులు ప్రయోజనం కల్గిస్తాయి. ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారిన వైఎస్ షర్మిల మరో సంచలనం రేపబోతున్నారు.
ఉద్యోగుల భర్తీ డిమాండ్‌తో నిరాహార దీక్ష ( Ys sharmilka Deeksha)కు సిద్ధమయ్యారు షర్మిల. ఇందిరా పార్క్( Indira park) లో ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. మూడ్రోజుల దీక్షకు అనుమతి అడిగితే..కరోనా వైరస్ వంటి పరిస్థితుల్ని పరిగణలో తీసుకుని కేవలం ఒక్కరోజు దీక్షకే పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఈ దీక్షకు ఎవరెవరు మద్దతు ఇవ్వనున్నారనేది కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ షర్మిల..టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ( Kodandaram), ప్రజా గాయకుడు గద్దర్ ( Gaddar)తో పాటు పలువురికి మద్దతు లేఖలు స్వయంగా రాశారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేయనున్న దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తరువాత ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని వామపక్ష, నిరుద్యోగ, ప్రజా సంఘాలు, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రతిసారీ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇదే అంశంపై దీక్ష చేపట్టి..మద్దతు కోరిన షర్మిలకు ఎవరెవరు సంఘీభావం ప్రకటించనున్నారనేది ఆసక్తిగా మారింది.
Also read: Oxygen Supply: పెరుగుతున్న కరోనా కేసులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలెండర్ల కొరత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook