Oxygen Supply: పెరుగుతున్న కరోనా కేసులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలెండర్ల కొరత

Oxygen Supply: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ప్రత్యామ్నయంగా ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్నించి అవసరమైన లిక్విడ్ ఆక్సిజన్ రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2021, 09:56 AM IST
Oxygen Supply: పెరుగుతున్న కరోనా కేసులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలెండర్ల కొరత

Oxygen Supply: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ప్రత్యామ్నయంగా ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్నించి అవసరమైన లిక్విడ్ ఆక్సిజన్ రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

కరోనా వైరస్ మహమ్మారి (Corona virus) ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత డిమాండ్‌ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌( Oxygen) అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో సుమారు 70 శాతం అవసరం ఉంది. కానీ అవసరం మేరకు సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఉన్న మాట వాస్తవమే. దాన్ని సరిదిద్దుకోవాలని మేం సూచించాం. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ( Liquid Oxygen) వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే కోరామని అధికారులు చెబుతున్నారు. 

లిక్విడ్ ఆక్సిజన్ వ్యవస్థను ఒకట్రెండు ఆసుపత్రులు మాత్రమే ఏర్పాటు చేసుకున్నాయని.. మిగిలినవన్నీ సాధారణ ఆక్సిజన్‌ సిలెండర్ల( Oxygen Cylinders)పైనే ఆధారపడుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. ఫలితంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత ( Oxygen Cylinders shortage) ఏర్పడిందని తెలిపారు. రోగులను చేర్చుకుని ఆక్సిజన్‌ అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.  అయితే  ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం వారానికి సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి అవసరమైన లిక్విడ్‌ ఆక్సిజన్‌ మరో వారం రోజుల్లో వస్తుందని పేర్కొంది.

ఇక కరోనా చికిత్సలో ప్రధానంగా ఉపయోగించే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల(Remdesivir Injections) విషయంలోనూ ప్రైవేట్‌ ఆసుపత్రుల మధ్య తీవ్రమైన ఆధిపత్యం కొనసాగుతోంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని కొన్నింటికి రెమిడెసివిర్‌ అందట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల బ్లాక్‌ మార్కెట్‌లో రెమిడెసివిర్‌ అమ్ముడవుతోంది. ఈ ఇంజక్షన్ సాధారణ ధర 5 వేలు కాగా, బ్లాక్‌ మార్కెట్‌లో 25 వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వద్ద మాత్రం ప్రస్తుతం 45 వేల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్‌ ప్రకారం మరో 15 రోజుల వరకు అవి సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, 3 నెలలకు సరిపడా 2 లక్షల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. అందులో రెండ్రోజుల్లో 45 వేల ఇంజక్షన్లు రాష్ట్రానికి వస్తాయని ఓ కీలకాధికారి తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Also read: Telangana Corona Cases: తెలంగాణలో తాజాగా 2,157 కరోనా పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News