Donald trump left white House: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మొత్తానికి శ్వేతసౌధాన్ని వీడారు. అటు డెమోక్రట్ జో బిడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  డోనాల్డ్ ట్రంప్ దంపతులకు వైట్‌హౌస్ సిబ్బంది వీడ్కోలు పలికారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బిడెన్ ( Joe Biden ) ప్రమాణ స్వీకారం చేశారు. . అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) కాస్సేపటి క్రితం శ్వేతసౌధాన్ని ( White House ) వీడారు. వైట్‌హౌస్ సిబ్బంది ట్రంప్ దంపతులకు వీడ్కోలు పలికిన సందర్బంగా డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. 


ట్రంప్ మాటల్లో…


ఈ నాలుగేళ్లు ఎంతో గొప్పగా గడిచాయి. మనమంతా కలిసి ఎన్నో సాధించాం. నా కుటుంబం, స్నేహితులు, నా సిబ్బందికి పేరు పేరునా ధన్యవాదాలు. మీరెంత కఠిన శ్రమకోర్చారో ప్రజలకు తెలియదు. అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితకాలంలో లభించిన గొప్ప గౌరవం. అందరికీ గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నా అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. మనది గొప్ప దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి. కరోనా మహమ్మారి ( Corona pandemic ) మనల్ని దారుణంగా దెబ్బకొట్టింది. అయినప్పటికీ మనమంతా కలిసి వైద్యపరంగా ఒక అద్భుతమే చేశాం. తొమ్మిది నెలల్లో వ్యాక్సిన్‌ ( Corona vaccine ) ను అభివృద్ధి చేసుకున్నామని తన హాయంలో ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం గురించి ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా పని చేయాలని సందేశమిచ్చారు. 


అనంతరం సతీమణి మెలానియాతో  కలిసి ఎర్రటి తివాచీపై నడుచుకుంటూ వచ్చిన ట్రంప్‌.. మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌లో ఎక్కి ఎయిర్‌బేస్‌కు బయల్దేరారు. అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఫ్లోరిడాకు చేరుకోనున్నారు.


Also read: Joe Biden First Sign: కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ ముందుగా తీసుకునే నిర్ణయాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook