London lockdown: ఇవాళ అర్ధరాత్రి నుంచి లండన్ లాక్ డౌన్
కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయాందోళనలు రేపుతోంది. బ్రిటన్ రాజధాని లండన్ లో మరోసారి లాక్ డౌన్ అమలు కానుంది. అక్టోబర్ 16 అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమలు కానున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
కరోనా వైరస్ ( Coronavirus ) సెకండ్ వేవ్ ( Second wave ) భయాందోళనలు రేపుతోంది. బ్రిటన్ రాజధాని లండన్ ( London Lockdown ) లో మరోసారి లాక్ డౌన్ అమలు కానుంది. అక్టోబర్ 16 అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమలు కానున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకోపం తగ్గనే లేదు. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ( Corona second wave ) ప్రారంభమైపోయింది. బ్రిటన్ ( Britain ) రాజధాని నగరమైన లండన్ లో సెకండ్ వేవ్ ప్రారంభం కావడం ఆందోళన కల్గిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ నేపధ్యంలో లండన్ నగరంలో లాక్డౌన్ ( Lockdown ) మరోసారి అమలు చేసేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 16వ తేదీ అంటే ఇవాళ రాత్రి నుంచి లండన్ నగరంలో లాక్డౌన్ అమలు కానుంది. ఈ లాక్డౌన్ 2-3 వారాల పాటు కొనసాగే అవకాశాలున్నాయి.
లాక్డౌన్ ప్రకటనను స్వయంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ( Britain pm Boris johnson ) చేశారు. లండన్ లాక్డౌన్ రూల్స్ ప్రకారం లండన్ ప్రజలు ఇతరుల ఇళ్లకు వెళ్లడం లేదా ఇతరుల్ని తమ ఇంటికి ఆహ్వానించడం పూర్తిగా నిషేధం. ఇండోర్, ,అవుడ్ డోర్స్‌లో గ్రూప్ సమావేశాలు జరపకూడదు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. అది కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కాకుండా కాలినడకన లేదా సైకిల్‌పై మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. బిజీ టైమింగ్స్, రద్దీగా ఉండే మార్గాలను అవాయిడ్ చేయడం మంచిది.
అయితే విద్యాలయాలు, యూనివర్సిటీలు, ప్రార్థనా మందిరాలు తెరిచే ఉంటాయి. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలను తక్కువమందితో నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు గానీ కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పబ్స్, రెస్టారెంట్స్ కూడా తెరిచే ఉంటాయి. అవుట్ డోర్స్ సమావేశాల్లో ఎక్కడైనా సరే ఆరుగురికి మించి ఉండకూడదు.
9 మిలియన్ల జనాభా ఉన్న లండన్ నగరంలో ప్రస్తుత పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని... దీన్ని కట్టడి చేయాలంటే ఆంక్షలు తప్పనిసరి అన్నారు యూకే హెల్త్ సెక్రటరీ హన్‌కాక్. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపధ్యంలో లండన్ ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి నిబంధనలు ఎవరికీ ఇష్టం లేనప్పటికీ... మనల్ని మనం కాపాడుకోవడానికి పాటించక తప్పదని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ తెలిపారు. అటు మరో యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ ( France ) లో కూడా కరోనా వైరస్ కట్టడికి ఆంక్షలు విధించారు. యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. Also read: Russian Second Vaccine: రెండవ కరోనా వ్యాక్సిన్ పై పుతిన్ కీలక ప్రకటన