న్యూ ఢిల్లీ: కరోనావైరస్‌కి ( Coronavirus ) చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఓవైపు కొవిడ్-19 వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) కోసం ప్రయోగాలు జరుగుతుండగానే మరోవైపు కరోనా పరీక్షల కిట్స్‌ని ( Coronavirus testing kits ) తక్కువ ధరలో, తక్కువ వ్యవధిలో ఫలితాలు వచ్చేలా రూపొందించడం కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇండియా-ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కలిసి కరోనా టెస్టింగ్ కిట్స్‌పై చేస్తోన్న ప్రయోగాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రయోగాల చివరి దశలో ఉన్న ఈ కిట్స్ అందుబాటులోకి వస్తే.. అర నిమిషంలోపే కరోనా ఫలితాలు ( Coronavirus test results ) వెల్లడించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా టెస్టింగ్ కిట్స్ ప్రయోగం పూర్తయితే.. ఇండియా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తయారీకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుందని ఇజ్రాయెల్ రాయభారి రాన్ మల్క తెలిపారు. Also read : COVID-19 in AP: కరోనాతో 24 గంటల్లో 31 మంది మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో రెండు, మూడు వారాల్లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ( Rapid testing kits ) అందుబాటులోకి రానున్నట్టు రాన్ మల్క పేర్కొన్నారు. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌తో తక్కువ ఖర్చుతో, స్వల్ప వ్యవధిలో కరోనా పరీక్షలు జరిపేందుకు ఆస్కారం ఉంటుందని రాన్ మల్క స్పష్టంచేశారు. Also read : WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe