Job opportunities in US: వాషింగ్టన్‌ : కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ కష్టాలు ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్నాయి. ఉద్యోగాల కోత, కొత్త ఉద్యోగాల లేమి సమస్యలు ( Job loss issues) యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక పరిస్థితిపై కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపించింది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోవడం ఎక్కువ అవడమే కాకుండా కొత్త ఉద్యోగాల కల్పన అనేది ఇప్పట్లో కనుచూపుమేరలో కనిపించడం లేదంటున్నారు అక్కడి ఆర్థిక నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ( US Federal reserve ) అధికారి ఒకరు స్పందిస్తూ.. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ అతి వేగంగానే పుంజుకుంటున్నప్పటికీ, ఉపాధి కల్పన విషయంలోనే ఇబ్బందులు తప్పేలా లేవు అని అన్నారు. ఉపాధి కల్పనలో సాధారణ పరిస్థితులు రావడానికి 2023 వరకు సమయం పట్టొచ్చని సదరు ఫెడరల్ రిజర్వ్ అధికారి తన అంచనాలను వెల్లడించారు. Also read : Naegleria fowleri infection: నల్లా నీళ్లలో మెదడును తినే ప్రాణాంతకమైన సూక్ష్మ జీవి


ప్రస్తుతం అందరిలో అవగాహన పెరిగిందని, ముఖానికి మాస్క్‌లు ధరించడం, అవసరం ఉంటే తప్ప లేదంటే బయటికి రాకపోతుండటం, భౌతిక దూరం ( Social distancing ) పాటిస్తుండటం వంటి పరిణామాల వల్ల కొత్తగా ఇన్ఫెక్షన్లు సోకే వారి సంఖ్య ( Coronavirus infections rate ) తగ్గిందనీ, ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కనిపిస్తోందని ఫిలడెల్ఫియా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హర్కార్‌ ( Patrick Harker ) అభిప్రాయపడ్డారు. 


వచ్చే ఏడాది మధ్య నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్‌ ( COVID-19 vaccines ) కూడా అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పిన ఆయన.. ఏదేమైనా కరోనావైరస్ కట్టడి చేయడం అతి కష్టమైన సవాలుగా మారిందని అన్నారు. ఈ కష్టాలన్నీ తీరడానికి ఎంతలేదన్నా మరో మూడేళ్లు పట్టొచ్చని పాట్రిక్ హర్కార్ వ్యాఖ్యానించారు. Also read : Disney Job Cuts: వాల్ట్ డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత.. తప్పడం లేదంటూ ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe