Disney Job Cuts: వాల్ట్ డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత.. తప్పడం లేదంటూ ప్రకటన

కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతోంది. కోట్లాది ఉద్యోగులు (Walt Disney Job Cuts) రోడ్డున పడ్డారు అయినా ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. వాల్ట్ డిస్నీ తమ థీమ్ పార్కులలో 28 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

Last Updated : Sep 30, 2020, 01:33 PM IST
Disney Job Cuts: వాల్ట్ డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత.. తప్పడం లేదంటూ ప్రకటన

కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి కోట్లాది ఉద్యోగాలను నాశనం చేసింది. తాజాగా అమెరికాలో మరో 28వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశం అమెరికా. దీంతో కోవిడ్19 (COVID-19) విపత్కర పరిస్థితులను ఎదుర్కోలేక వ్యాపార దిగ్గజం వాల్ట్ డిస్నీ భారీగా ఉద్యోగాల కోత విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికా థీమ్ పార్క్‌లలో పనిచేసే 28 వేల ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది.

ఖర్చులు తగ్గించుకున్నా, పనులు వేగవంతం చేసినా కోవిడ్19 ప్రతికూల పరిస్థితులతో వ్యాపారంపై ప్రభావం చూపుతోందని డిస్నీ పార్క్ చైర్మన్ జోష్ డి అమారో తెలిపారు. గత కొంతకాలం నుంచి ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎంతగానో ఆలోచించిందని, కానీ భారీగా ఉద్వాసన తప్పడం లేదన్నారు. తమ ఉద్యోగులలో నాలుగో వంతు.. 28 వేల ఉద్యోగులను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఉద్వాసనకు గురైన వారిలో దాదాపు 70శాతం వరకు కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులేనని వెల్లడించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News