Omicron : Experts Warn Against Cloth Masks they are useless in fight against Omicron : ఒక వైపు ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. అయితే చాలా మంది  ఒమిక్రాన్‌ నుంచి రక్షణ కోసం రంగురంగుల క్లాత్ ఫేస్ మాస్క్‌లు, డిజైన్స్ క్లాత్ మాస్క్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ క్లాత్ ఫేస్ మాస్క్‌లు నిజంగా వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తాయా.. లేదంటే ఈ క్లాత్ మాస్క్‌లు (Cloth Masks) ప్రమాదకరమైనావా అనే విషయంపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే.. ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్‌హాల్గ్ ప​లు విషయాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పలు మెటీరియల్స్‌ మిక్స్‌ చేసి తయారు చేసిన డబుల్ లేదా ట్రిపుల్-లేయర్ మాస్క్‌లు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయని  ప్రొఫెసర్ ట్రిష్ పేర్కొన్నారు. కానీ క్లాత్ కవరింగ్‌ మాస్క్‌లు కేవలం ఫ్యాషన్ కోసమే అని ట్రిష్ తెలిపారు.


ఒమిక్రాన్.. (Omicron) ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ (Covid) ఇన్‌ఫెక్షన్‌లు పెరగడానికి కారణమవుతోంది. చాలా దేశాలు దీన్ని అరికట్టేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయినా కూడా ఒమిక్రాన్ భయం మాత్రం ప్రజల్ని వెంటాడుతూనే ఉంది.


ఈ నెల ప్రారంభంలో బ్రిటన్ లో కఠిన ఆంక్షలు తిరిగి అమల్లోకి వచ్చాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో, పబ్లిక్ ప్లేస్‌లలో మాస్క్‌ ధరించడాన్ఇ తప్పనిసరి చేసింది బ్రిటన్ (Britain) ప్రభుత్వం. ఇక ఒమిక్రాన్ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ఫేస్ మాస్క్‌లు ధరించాలి అనే విషయంపై పలు పరిశోధనలు చేపట్టారు నిపుణులు. 


Also Read : వైరల్ వీడియో.. తనను తాను మింగేసిన పాము! చివరికి ఏమైందంటే?


ఈ క్రమంలో ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్‌హాల్గ్ మాస్క్‌ల గురించి పలు విషయాలు తెలిపారు. క్లాత్‌ కవరింగ్‌ మాస్క్‌ (cloth covering masks) ఎలాంటి ఆరోగ్య ప్రమాణాలను కలిగి ఉండదని వెల్లడించారు. అయితే N95 రెస్పిరేటర్ మాస్క్‌లను (N95 respirator masks) మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తూ తయారు చేస్తారని చెప్పారు.


అలాగే మాస్క్ ముక్కు, నోటిని సరిగ్గా కవర్ చేయకపోతే దాని వల్ల పెద్ద ఫలితం ఉండదన్నారు. అలాగే మాస్క్ ధరించిన కూడా సులభంగా ఊపిరి పీల్చుకోగలగాలి అని గ్రీన్హాల్గ్ చెప్పారు. అయితే కొందరు బట్టతో తయారు చేసే మాస్క్‌లను ఉపయోగిస్తున్నారన్నారు. వాటిని ఉతికి మళ్లీ ఉపయోగిస్తున్నారన్నారు. ఇలాంటి క్లాత్ మాస్క్‌లనే జనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. వైరస్‌ను అడ్డుకునే శక్తి వాటికి ఉండదన్నారు. ఇక కెనడియన్లు సింగిల్ - లేయర్‌ (single layer) క్లాత్ మాస్క్‌లు తమకు అసలుకే వద్దు అని చెబుతున్నారు.


సింగిల్ - లేయర్‌ క్లాత్ మాస్క్‌లు వైరస్‌పై ఎలాంటి ఎఫెక్ట్‌ చూపవు.. సింగిల్‌ లేయర్ ఉండే మాస్క్‌లకు ఫిల్ట్‌రేట్ చేసే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని ఒంటారియో సైన్స్ అడ్వైజరీ టేబుల్ హెడ్ పీటర్ జూని పేర్కొన్నారు. దీని వల్ల కోవిడ్‌ వైరస్‌ను అడ్డుకునే శక్తి సింగిల్‌ లేయర్ మాస్క్‌లకు ఉండదని తెలిపారు. మొత్తానికి నిపుణులు చెప్తోన్న ప్రకారం.. క్లాత్ ఫేస్ మాస్క్‌లు కేవలం ఫ్యాషనబుల్‌గా ఉంటాయి గానీ కోవిడ్‌ (Covid) వైరస్‌ అడ్డుకునేందుకు ఇవి ఉపయోగపడవు అని స్పష్టం అవుతోంది. N95 రెస్పిరేటర్ మాస్క్‌లనే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read : Bank Holidays December 2021: ఆరు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఏఏ రోజుల్లో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook