Bank Holidays December 2021: ఈ ఏడాది చివర్లో అనగా డిసెంబరు 2021 ముగియడానికి మరో 8 రోజులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో వారంలో ఈ ఏడాది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన అనేక పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. డిసెంబర్ నెలలో నేటి (December 24) నుంచి బ్యాంకులకు 6 రోజులు సెలవులు (Bank Holidays in Decemeber) ఉంటాయి. ఆ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసా?
6 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు
డిసెంబరు నెలలో మిగిలిన 8 రోజుల్లో 6 రోజులు సెలవు దినాలుగా ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా సెలవుతో పాటు ఆదివారం తో కలిపి నేటి నుంచి 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
ఆదివారం, నెలలో నాలుగో శనివారంతో పాటు క్రిస్మస్ కలిసి రావడం వల్ల వరుస సెలవులకు కారణమైంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ రాష్ట్రంలో ఏ రోజు బ్యాంకులు మూసివేయనున్నారో తెలుసుకుందాం. ఈ సెలవులకు అనుగుణంగా మీ బ్యాంకుకు సంబంధించిన పనులు పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
డిసెంబర్ నెలాఖరులో రానున్న 6 సెలవులు ఎప్పుడంటే?
డిసెంబర్ 24 - క్రిస్మస్ పండుగ (మిజోరాంలోని ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేత)
డిసెంబర్ 25 - క్రిస్మస్ (బెంగళూరు, భువనేశ్వర్ మినహా అన్ని ప్రదేశాలలో బ్యాంకులు మూతబడి ఉంటాయి) అంతేకాకుండా నెలలో నాలుగో శనివారం కావడం వల్ల బ్యాంకులకు సెలవు ఉంటుంది.
డిసెంబర్ 26 - ఆదివారం (వారాంతపు సెలవు)
డిసెంబర్ 27 - క్రిస్మస్ వేడుక (మిజోరాంలోని ఐజ్వాల్ లో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 30 - యు కియాంగ్ నోంగ్‌బా (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 31 - న్యూ ఇయర్ ఈవినింగ్ (మిజోరాంలోని ఐజ్వాల్ లో బ్యాంకులకు సెలవు).
ALso Read: Infinix Note 11 Flipkart: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది.. ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే!
Also Read: RBI new rules: ఆన్లైన్ లావాదేవీలా? ఆర్బీఐ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి