Snake Eating Itself: వైరల్ వీడియో.. తనను తాను తినడానికి ప్రయత్నిస్తున్న పాము! చివరికి ఏమైందంటే?

కింగ్‌ స్నేక్‌ జాతికి చెందిన పాము తన బాడీని సగం వరకు మింగేసింది. ఆ సమయంలో తన యజమాని వచ్చి తలపై కొట్టడంతో ఆ పాము మింగిన బాడీని బయటికి వదిలేసింది. 

Last Updated : Dec 24, 2021, 01:07 PM IST
  • తనను తాను తినడానికి ప్రయత్నిస్తున్న పాము
  • బాడీలోని సగం పార్టును మింగేసిన పాము
  • తలపై హ్యాండ్ శానిటైజర్‌ పూయగానే స్పందించిన పాము
Snake Eating Itself: వైరల్ వీడియో.. తనను తాను తినడానికి ప్రయత్నిస్తున్న పాము! చివరికి ఏమైందంటే?

king Snake trying to Eating Itself, Almost swallowed its whole body: సాధారణంగా పాములు తమ ఆహారంగా కప్పలు, ఎలుకలు, చిన్న కోడి పిల్లలు లాంటి వాటిని తీసుకుంటాయి. కొన్ని పాములు అయితే గుడ్లు, పాలు లాంటివి కూడా తీసుకుంటాయి. ఇంకా కొన్ని పెద్ద పాములు అయితే చిన్న చిన్న పాములనే తినేస్తుంటాయి. కానీ తనను తానే తినడానికి ప్రయత్నించిన ఓ పాము కూడా ఉంది. కింగ్‌ స్నేక్‌ జాతికి చెందిన పాము తన బాడీని సగం వరకు మింగేసింది. ఆ సమయంలో తన యజమాని వచ్చి తలపై కొట్టడంతో ఆ పాము మింగిన బాడీని బయటికి వదిలేసింది. విషయంలోకి వెళితే... 

కింగ్‌ స్నేక్‌ రకానికి చెందిన పాముని రాబ్ క్లార్క్ వెనిటాక్స్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. రాబ్ క్లార్క్ పామును శుభ్రం చేసిన అనంతరం ఆహరం కూడా పెట్టాడు. అయితే కొత్త సమయం అనంతరం ఆ పాము తనని తాను మింగేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ పాము తన బాడీలోని సగం పార్టును మింగేసింది. ఇది గమనించిన రాబ్ క్లార్క్.. వెంటనే పాము తలపై హ్యాండ్ శానిటైజర్‌ని పూశాడు. దాంతో ఆ పాము మింగిన బాడీని బయటికి వదిలేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియో చూసిన వారు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హోస్ట్‌గా బాలయ్య..?? గెట్ రెడీ ఫర్ అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్..?

శానిటైజర్ రుచిని ఇష్టపడని కింగ్‌ స్నేక్‌ రకానికి చెందిన పాము తన బాడీని వదిలేసిందని యజమాని రాబ్ క్లార్క్ వెనిటాక్స్ తెలిపాడు. రాబ్ క్లార్క్ మాట్లాడుతూ... 'పాములు వాటి కళ్లను రక్షించే స్పష్టమైన పొలుసులను కలిగి ఉంటాయి. అందుకే హ్యాండ్ శానిటైజర్ రాయగానే అది భయపడిపోయి మింగిన బాడీని వదిలేసింది. ప్రస్తుతం పాము కళ్లు బాగున్నాయి. ఆహరం కూడా తినింది. కింగ్‌ స్నేక్‌ రకానికి చెందిన పాములు తనని తాను తినడానికి ప్రయత్నిస్తాయి. ఇది చాలా అరుదైన పాము. ఒత్తిడి, ఆకలి లేదా ఉష్ణోగ్రతలు లాంటి కారణాలతో ఇలా జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా పెంచుకుంటున్నా.. ఇలా జరగడం ఇదే మొదటిసారి. మొగత ఐదు కింగ్‌ స్నేక్‌లలో ఇలా ఎప్పుడూ జరగలేదు' అని తెలిపారు. 
Also Read: Bank Holidays December 2021: ఆరు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఏఏ రోజుల్లో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News