చైనీస్ యాప్ ( Chinese app ) ల నిషేధంలో అగ్రరాజ్యం అమెరికా ( America ) సైతం ఇండియా బాట పట్టింది. టిక్ టాక్, వి చాట్ యాప్ లను నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రేపట్నించి నిషేధం అమల్లో రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) ఆవిర్భావం నుంచి ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన చైనా ( China ) కు ఒకదాని తరువాత మరొకటిగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి చెందిన దాదాపు 89 యాప్ లను ఇండియా ( India banned 89 chinese apps ) నిషేధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్ టాక్ యాప్ ( TikTok app Ban ) పై నిషేధం ఆ దేశాన్ని ఆర్ధికంగా దెబ్బతీసింది. ఇప్పుడు ఇండియా బాటపట్టింది అగ్రరాజ్యం అమెరికా. వాస్తవానికి కొద్దిరోజుల ముందే నిషేధించాల్సి ఉన్నా...నిర్ణీత గడువు విధించింది అమెరికా. టిక్ టాక్ తో పాటు వి చాట్ యాప్ ( V chat app ban ) ను నిషేధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది. ఆదివారం నుంచి ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లో రానున్నాయి. 


జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన నడిచే కంపెనీల యాప్ లను ఉపయోగించడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని..దేశ ఆర్ధిక వ్యవస్థ, విదేశాంగ విధానం వంటి అంశాలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతో నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. అమెరికా-చైనాల మధ్య దౌత్య, వాణిజ్య యుద్ధం ముదిరిన నేపధ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. 


వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ ను అమెరికాకు చెందిన కంపెనీకు విక్రయించాలని..లేదంటే నిషేధిస్తామని గతంలోనే అధ్యక్షుడు ట్రంప్ ( Donald trump ) హెచ్చరించారు. దాంతో ముందు మైక్రోసాఫ్ట్ సంస్థ ( Microsoft ) కొనుగోలు కోసం ప్రయత్నించినా చర్చలు ఫలించలేదు. అనంతరం మరో అమెరికన్ కంపెనీ ఒరాకిల్ ( oracle ) ప్రయత్నించింది. టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ ( Bytedance ) తో చర్చలు జరిపింది. బైట్ డ్యాన్స్ కు మెజార్టీ వాటా, ఒరాకిల్ కు మైనర్ వాటా ఉండేలా ఒప్పందం కుదరాల్సి ఉంది. ఇలాంటి ఒప్పందాన్ని తన దేశంలో అనుమతించనని ట్రంప్ స్పష్టం చేయడంతో అది కూడా ఆగిపోయింది. Also read: Covid19 Test: కచ్చితమైన ఫలితాలు, మార్కెట్ లో మరో కొత్త పరికరం