First Covid-19 Case: ఆ దేశంలో మొదటి కోవిడ్-19 కేసు నమోదు!
First Coronavirus Case | ప్రపంచం మొత్తాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య మొల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. జనవరి 2021 నుంచి సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశ ఉంది. కొన్ని ప్రాంతాల్లో సెకండ్, థర్డ్ వేక్ ఇప్పటికే మొదలైంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ వల్ల మళ్లీ లాక్ డౌన్ కూడా విధించారు.
Covid-19 | ప్రపంచం మొత్తాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య మొల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. జనవరి 2021 నుంచి సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశ ఉంది. కొన్ని ప్రాంతాల్లో సెకండ్, థర్డ్ వేక్ ఇప్పటికే మొదలైంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ వల్ల మళ్లీ లాక్ డౌన్ కూడా విధించారు.
ALSO READ| Covid-19 Symptoms: కరోనావైరస్ లక్షణాలు కనిపించేందుకు 8 రోజులు కూడా పట్టవచ్చు
ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ప్రతీ దేశం చాలా కష్టపడుతోంది. అదే సమయంలో కరోకా కాలుమోపని దేశాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
దాదాపు ఎనిమిది నెలల నుంచి కోవిడ్-19 ( Covid-19) సోకకుండా జాగ్రత్తలు పాటించింది మంగోలియా. అయితే ఇటీవలే ఆ దేశంలో తొలి కేసు నమోదు అయిందట. స్థానిక న్యూస్ ఏజెన్సీ ప్రకారం మంగోలియాకు చెందిన 29 సంవత్సరాల ఒక ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ కు నోవెల్ కరోనావైరస్ ( Coronavirus) సోకిందట.
ALSO READ| Pregnancy in Covid-19 Time: కోవిడ్-19 సోకకుండా గర్భిణిలు ఏం చేయాలి ? వస్తే పాలు ఇవ్వవచ్చా ?
అయితే అతడు సమారు 21 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకుని అల్టెన్ బులాంగ్ సరిహద్దు గుండా రష్యాకు ( Russia ) చేరుకోగా అక్కడ అతనికి పరీక్షలు నిర్వహించారు. షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే అతనికి మళ్లీ కరోనావైరస్ నిర్ధారణ అయింది.
ALSO READ| WHO Kitchen Tips: ఇన్ఫెక్షన్ నుంచి ఆహారాన్ని సురక్షితంగా ఉంచే WHO చిట్కాలు
మంగోలియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దీనిపై స్పందిస్తూ అతడిని సంప్రదించిన వ్యక్తులను ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు. దాంతో పాటు లాక్ డౌన్ కూడా విధిస్తున్నట్టు తెలిపారు. ఇలా చేయడం వల్ల వైరస్ ఇతరులకు సంక్రమించకుండా నిలువరిస్తాం అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారాయన.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR