న్యూజిలాండ్ లో ( New Zealand ) 102 రోజుల తరువాత మళ్లీ కోవిడ్-19 ( Covid-19) కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదు అయిన న్యూజిలాండ్ లోని అతిపెద్ద నగరం అయిన ఆక్లాండ్ (Auckland ) ను లాక్ డౌన్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దేశంలో సుమారు 102 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు (Coronavirus ) నమోదు కాలేదు అని.. విదేశీయులను ఐసోలేషన్ చేశాకే దేశంలో తిరిగే అవకాశం ఇచ్చేవాళ్లం అని అధికారులు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జాసిండా ఆర్డెర్న్ ( Jacinda Ardern ) మాట్లాడుతూ ఆక్లాండ్ లో మూడవ లెవల్ నిషేధాలు కొనసాగుతాయి అని.. ముందు జాగ్రత్త చర్యగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు.



అక్లాండ్ లో లాక్ డౌన్ ( Lockdown in Auckland)  మూడు రోజుల పాటు కొనసాగుతుంది అని అది శుక్రవారం రోజు ముగుస్తుంది అని సమాచారం. ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులకు కరోనావైరస్ సంక్రమించింది అని ఇందులో ఒక వ్యక్తి వయసు 50 సంవత్సరాలు అని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో ముందుగానే సిద్ధం అయ్యాం అని.. అయితే వైరస్ ఎలా సంక్రమించింది అనేది ఇప్పటికీ తెలియని విషయం అని ఆరోగ్యశాఖ అధికారు తెలిపారు.