Corona Antibody వచ్చేసింది, ఇక వ్యాక్సిన్ పై తొందరపాటు అవసరం లేదు!
కోవిడ్-19పై ( Covid-19) పోరాటం కోసం రష్యా వ్యాక్సిన్ ( Russian Vaccine ) వచ్చేసినా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) దానిపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఇంకా సిద్ధం కాలేదు.
కోవిడ్-19పై ( Covid-19) పోరాటం కోసం రష్యా వ్యాక్సిన్ ( Russian Vaccine ) వచ్చేసినా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) దానిపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఇంకా సిద్ధం కాలేదు. ఇలాంటి సమయంలో శాస్త్రవేత్తలు కరోనావైరస్ తో పోరాడే యాంటిబాడీస్ ని సిద్ధం చేశారు. శత్రువుతో పోరాడటానికి మన దగ్గర ఒక ఆయుధం ఇంకా సిద్ధం కాలేదు..కానీ రెండో ఆయుధం సిద్ధం అయింది. వ్యాక్సిన్ రాలేదు.. ఓకే! కానీ యాంటీబాడీస్ వచ్చేశాయి. కరోనావైరస్ పై ( Coronavirus ) పోరులో ప్రపంచం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇదే క్రమంలో శాస్త్రవేత్తల శ్రమ ఫలించింది. కరోనావైరస్ సంక్రమణను అరికట్టే శక్తివంతమైన యాంటీబాడీసి రెడీ చేయడంలో విజయం సాధించారు.
ALSO READ| Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
యాంటీబాడీ తయారుచేసిన జర్మని...
జన్మనీ సెంటర్ ఫర్ న్యూరోడీజెనెరేటీవ్, బెర్లిన్ లోని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ ఘనత సాధించాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి ఆరువందల కన్నా ఎక్కువ యాంటీబాడీస్ ( Antibody) లో ఒక యాంటీబాడీని కోవిడ్-19 విరుగుడుగా కనుక్కున్నారు. ఇక ఈ యాంటీ బాడీతో కరోనా టీకా వచ్చేంత వరకు ట్రీట్మెంట్ చేయవచ్చు.
ALSO READ| How To Wear Mask: మాస్క్‌లు ధరించే సరైన విధానం మీకు తెలుసా?
ప్రయోగశాలలో సిద్ధం చేశారు..
సిద్ధాంత పరంగా ఈ టీకా విషయంలో శాస్త్రవేత్తలు ఎన్నో ఆలోచనలు చేశారు. పరిశోధన కొనసాగించారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలం అయినప్పుడు ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్ గురించి ప్రయత్నించారు. వాటిని తమ ప్రయోగశాలో సిద్ధం చేశారు. కోవిడ్-19 వంటి పరాన్నజీవి శరీరంలోని కణాల్లోకి వెళ్లినప్పుడు ఈ యాంటీబాడీస్ వాటిని నిలువరిస్తాయి.
ఇమ్యూనిటీని బూస్ట్ చేసే యాంటీ బాడీ.
జర్మనీలో సిద్ధం అయిన ఈ యాంటీ బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో కరోనావైరస్ ను శరీరం తట్టుకుంటుంది. దాంతో పాటు వైరస్ ను అంతం చేస్తుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR