H1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్, హెచ్ 1బి వీసా రిజిస్ట్రేషన్ రేపట్నించే
H1B Visa: అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. అమెరికా హెచ్ 1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చ్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రేపట్నించి ప్రారంభం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
గత ట్రంప్ ప్రభుత్వంలో హెచ్ 1 బి వీసాల ప్రక్రియకు ఇబ్బంది ఎదురైంది. అగ్రరాజ్యానికి ఉద్యోగం కోసం వెళ్లాలనుకునేవారు బిడెన్ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడా కోరిక నెరవేరనుంది. హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమెరికా ప్రభుత్వం మార్చ్ 1 రేపట్నించి ప్రారంభించనుంది.
ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఆర్ధిక రంగాల్లోని యువతీ యవకులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటారు. హెచ్ 1 బి వీసా ఉంటేనే ఇది సాధ్యమౌతుంది. మార్చ్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసాల జారీ ప్రక్రియను ప్రారంభిస్తోంది. మూడేళ్లపాటు ఇచ్చే ఈ వీసా ఆ తరువాత పొడిగించవచ్చు. రేపట్నించి హెచ్ 1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చ్ 17వ తేదీతో ఈ రిజిస్ట్రేషన్ ముగియనుంది. ప్రతి యేటా దాదాపు 65 వేల హెచ్ 1 బి వీసాలు మంజూరు చేస్తాయి. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేద్దామనుకునేవారికి మరో 20 వేల హెచ్ 1 బీ వీసాలు అందిస్తుంది.
హెచ్ 1 బి వీసాకు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి
https://myaccount.uscis.gov/users/sign_up లింక్‌లో వెళ్లి myUSCIC ఆప్షన్ క్లిక్ చేయాలి. ముందుగా ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు 10 యూఎస్ డాలర్లు ఫీజు చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్. పేమెంట్ జరిగేవరకూ వివరాలు మార్చుకునేందుకు అవకాశముంటుంది. తుది జాబితాను మార్చ్ 31న ప్రకటిస్తారు. జాబితాలో అనుమతి లభించినవాళ్లు 90 రోజుల్లోగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగం ఇచ్చే కంపెనీ, యజమాని వివరాలు, గుర్తింపు సంఖ్య, పాస్‌పోర్ట్ వివరాలు ఎంట్రీ చేయాలి.
Also read: Turkey Syria Earthquake: తుర్కియే, సిరియాల్లో 50 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook