ఉత్తర అరేబియా సముద్రంలో భారత దేశం ( India ), జపాన్ దేశాల స్నేహ సందేశం ప్రపంచానికి తెలిసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అద్భుతమైన చిత్రాలు ప్రపంచం ముందుకు వచ్చాయి.  భారత్-జపాన్ మధ్య నావికాదళ యుద్ధ అభ్యాసం ప్రారంభం అయింది. ఇది చైనాకు ( China ) పరోక్షంగా గట్టి సందేశాన్ని ఇస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ|  CIBIL Score: సిబిల్ స్కోర్ ఎలా తగ్గుతుందో తెలుసా ? ఈ విషయాలు తెలుసుకోండి!


భారత్ , జపాన్ మధ్య సముద్ర స్నేహానికి ప్రతిరూపం
సెప్టెంబర్ 26 నుంచి అరేబియా సముద్రంలో భారత్, జపాన్ దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధ సాధన చేస్తున్నాయి. ఇది రేపటి వరకు అంటే 28 వరకు కొనసాగుతుంది. ఈ సంయుక్త అభ్యాసానికి జీమెక్స్-2020 ( JIMEX-2020 ) అని పేరు పెట్టారు. ఈ సాధన వల్ల భారత నౌకాదళానికి అద్భుతమైన శక్తి సమకూరుతుంది.



హైక్లాస్ నేవల్ ఎక్సర్ సైజ్ సాంకేతికత నుంచి యుద్ధ వ్యూహాలను అమలు చేయడం వరకు అన్నింటినీ సాధన చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య సెప్టెంబర్ 9న ఒక ఒప్పందం జరిగింది. ఈ అగ్రీమెంట్ లోని అంశాలు ఇప్పుడు అమలులోకి వస్తూ ఇలా యుద్ధ సాధన ప్రారంభం అయింది.


యుద్ధ సాధనలో భాగంగా వెపన్ ఫైరింగ్, క్రాస్ డెక్ హెలికాప్టన్ కార్యక్రమం, కాంప్లెక్స్ సర్ఫేస్, యాంటి సబ్ మెరీన్ , వాయు రక్షణ అంశాలపై డ్రిల్ నిర్వహించారు.



ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు


భారతీయ నౌకాదళం తరపున దేశీయంగా డెవలెప్ చేసిన స్టీల్త్ డిస్ట్రాయర్, తల్వార్ క్లాస్ INS తర్కష్, ఫ్లీట్ ట్యాంకర్ దీపక్ కూడా ఇందులో పాలుపంచుకున్నాయి.



జపాన్ ( Japan ) నుంచి సాగరాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసే ఫోర్స్ అయినా కాగా యుద్ధ నౌక, ఇజుమో క్లాస్ కు చెందిన హెలికాప్టర్ డిస్ట్రాయర్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఇకాజుకీలు సాధనలో భాగం అయ్యాయి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR