కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) త్వరలో అందుబాటులో వచ్చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 3 దిగ్గజ కంపెనీలు చివరి దశ ఫలితాలు విజయవంతమైనట్టు చెబుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ..ఉత్పత్తి, పంపిణీ మాటేంటి..ఇదే అతిపెద్ద సవాలంటున్నారు ఫార్మా నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ( Corona virus ) బారిన పడింది. వైరస్ తాకని దేశమే లేదు. అంటే ప్రపంచమంతటికీ వ్యాక్సిన్ అందించాలంటే ఎన్ని వందల కోట్ల వ్యాక్సిన్ లు కావల్సి ఉంటుంది. ఈ వందల కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకు ఎంత సమయం పడుతుంది. ఇదే ఇప్పుడున్న అతి పెద్ద సవాలుగా చెబుతున్నారు ఫార్మా నిపుణులు. 


చివరి దశ ప్రయోగాలు విజయవంతమైనట్టు ఇప్పటికే ఫైజర్ ( Pfizer ), మోడెర్నా ( Moderna ) కంపెనీలు ప్రకటించాయి.  నోవావాక్స్ ( Novavax ), ఆస్ట్రాజెనెకా ( AstraZeneca ), జాన్సన్ అండ్ జాన్సన్ ( Johnson and Johnson ) కంపెనీల ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. ఇంకా ఈ వ్యాక్సిన్ లన్నీ తుది అనుమతులు పొందాల్సి ఉంది. ఇదంతా దాటిన తరువాతే ఉత్పత్తి ప్రారంభం కావాలి. పంపిణీ జరగాలి. ఫెడరల్ సంస్థల్నించి త్వరితగతిన అనుమతులు తీసుకున్నప్పటికీ భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం కష్టమే. డిసెంబర్ నాటికి లేదా జనవరికి మ్యాగ్జిమమ్ 5 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేయవచ్చనేది ఓ అంచనా.  ఈ కంపెనీల వ్యాక్సిన్  ముందుగా అమెరికన్లకే అందనుంది. యూఎస్ ప్రభుత్వమైతే ఈ ఏడాదికి 3 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ కష్టమేనంటున్నాయి ఫార్మా కంపెనీలు. Also read: Air Strike: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు


వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఎదురయ్యే సవాళ్లు


వాస్తవానికి కోవిడ్‌-19 వ్యాక్సిన్ల తయారీ ( Corona vaccine production ) లో ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు కొత్త టెక్నాాలజీని వినియోగించాయి. ఇటువంటి టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్లకు గతంలో అనుమతిచ్చిన  పరిస్థితి లేదు. మరోవైపు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేయాలంటే..ముఖ్యంగా భారీగా ముడి సరుకు సమకూర్చుకోవాలి. అన్నింటినీ క్రోడీకరించి అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్ బ్యాచ్ లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ఫార్మా కంపెనీకు కూడా తక్కువ వ్యవధిలో భారీ ఎత్తున ఉత్పత్తి, మార్కెటింగ్ చేసిన అనుభవం లేదు. అందుకే అసాధ్యమంటున్నారు ఫార్మా నిపుణులు. 


కంపెనీల లక్ష్యం, పెట్టుబడి, సాధ్యాసాధ్యాలు


ఫైజర్ కంపెనీ ( Pfizer Company ) లక్ష్యమైతే 10 కోట్ల డోసులుగా పెట్టుకుంది గానీ..అందులో సగం అంటే  5 కోట్లే అందించగలనని భావిస్తోంది. 10 కోట్ల డోసుల్ని అందించేందుకు మోడెర్నా 2 బిలియన్‌ డాలర్లను ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి తీసుకుంది. అయితే జనవరి నాటికి కేవలం 2 కోట్ల డోసులే అందించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. అటు ఫైజర్‌ కంపెనీ..10 కోట్ల డోసేజీలను 1.95 బిలియన్‌ డాలర్లకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ 5 కోట్లే చేయవచ్చనేది అంచనాగా ఉంది. ఇక రెండు డోసుల్లో వ్యాక్సిన్ రూపొందిస్తున్న నోవావాక్స్‌ వచ్చే ఏడాదిలో 2 బిలియన్లకు పైగా డోసుల్ని అందించాలని ఆలోచిస్తోంది. వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి నోవావాక్స్‌ కంపెనీ..1.6 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరో ప్రఖ్యాత కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సైతం మార్చి నాటికి 10 కోట్ల డోసుల్ని సిద్ధం చేయాలనుకుంటోంది. Also read: Joe Biden's Cabinet: బైడెన్ కేబినెట్‌లో వివేక్ మూర్తి, అరుణ్ మజుందార్ ?