హైదరాబాద్: అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికనై జో బైడెన్ త్వరలోనే ఏర్పాటు చేయబోయే కొత్త మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు వెళ్లడానికంటే ముందుగానే బైడెన్‌కు అడ్వైజర్‌గా పనిచేసిన వివేక్ మూర్తికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్‌కు కూడా బైడెన్ కేబినెట్‌లో చోటు ఖాయం అనే టాక్ అమెరికన్ మీడియాలో వినిపిస్తోంది.
వివేక్ మూర్తికి, అరుణ్ మజుందార్‌కి జో బైడెన్ మంత్రివర్గంలో ( Joe Biden Cabinet ) పదవులు ఖాయం అనే కాకుండా.. వారికి కేటాయించనున్న శాఖలు, విభాగాలపై కూడా బైడెన్‌కి ఇప్పటికే ఓ స్పష్టత ఉన్నట్టు తెలుస్తోంది. వివేక్ మూర్తికి ( Vivek Murthy ) హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ మంత్రిగా, అరుణ్ మజుందార్‌కి ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయనేది సదరు కథనాల సారాంశం.
Also read : GHMC elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే
ప్రస్తుతం వివేక్ మూర్తి కోవిడ్-19 సలహాదారుల బృందంలో ఉండగా.. స్టాన్‌ఫోర్డ్‌లో మెకానిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేసిన అరుణ్ మజుందార్ ( Arun Majumdar ).. అక్కడే అడ్వాన్స్‌డ్ రీసర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీకి డైరక్టర్‌గానూ వ్యవహరించారు. బైడెన్‌కు అడ్వైజర్‌గానూ సేవలు అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి సేవలను బైడెన్ ఇకపై కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని సదరు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి