అమెరికా ఎన్నికలకు ( America Elections ) సర్వం సిద్ధమైంది. మరి కొన్నిగంటల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ట్రంప్ కు షాకిచ్చే ప్రకటన వెలువడింది. డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) కారణంగా ఆ 7 వందలమంది మరణించినట్టు నివేదిక స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నవంబర్ 3 . అంటే మరి కొన్ని గంటల వ్యవధిలో మొత్తం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ ( Republican party )  తరపున అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీపడగా...డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) తరపున జో బైడెన్ ( Joe biden ) తొలిసారి పోటీ పడ్డారు. నువ్వా నేనా రీతలో ఇరువురి మధ్య పోరు సాగింది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. కరోనా వైరస్ ( Corona virus ) నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 


బరాక్ ఒబామా ( Obama )  అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా చేసిన జో బైడెన్ ఈసారి అధ్యక్ష బరిలో నిలిచారు. కరోనా సంక్రమణ విజృంభిస్తున్నా సరే.. ఏమాత్రం లెక్కచేయకుండా 
ఇరువురు నేతలు  ప్రచారంలో పాల్గొన్నారు.  ట్రంప్ కరోనా వైరస్ బారిన కూడా పడ్డారు. ఇక ప్రచారం ముగిసింది. మరి కొన్ని గంటల వ్యవధిలో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఓ కీలక నివేదికను విడుదల చేసింది. కచ్చితంగా ఇది ట్రంప్ కు షాకింగ్ పరిణామమే.


అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగా అమెరికాలో దాదాపు 30వేల మంది పౌరులు కరోనా వైరస్‌ బారిన పడగా.. మరో​ 7 వందలమంది చనిపోయారని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ( stanford university ) నివేదికలో పేర్కొంది. వైరస్‌ సంక్రమణను లెక్కచేయకుండా నిబంధనలు ఉల్లంఘించి ప్రచార ర్యాలీలు నిర్వహించడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ కు ప్రచారాస్త్రంగా మారింది. అమెరికన్ల ప్రాణాలపై ట్రంప్‌కు ఏ బాధ్యత, గౌరవం లేదని జో బైడెన్ విమర్శించారు. Also read: Meccah: బారికేడ్లు ధ్వంసం చేసి మక్కా మసీదులో దూసుకెళ్లేందుకు యత్నం