USA Elections: ట్రంప్ కు మద్దతుగా బిన్ లాడెన్ ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు రంగంలో నిలిచారు. ట్రంప్ ఓడిపోతే దేశంలో 9/11 తరహా దాడులు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ( America president Elections ) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు రంగంలో నిలిచారు. ట్రంప్ ఓడిపోతే దేశంలో 9/11 తరహా దాడులు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) తరపున జో బైడెన్ ( joe biden ) పోటీ చేస్తుండగా..రిపబ్లికన్ పార్టీ తరపున రెండోసారి అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) నామినేట్ అయ్యారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా 9/11 దాడుల తరహా సూత్రధారి, దివంగత ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ ( osama bin laden ) మేనకోడలు ( Daughter in law ) నూర్ బిన్ లాడెన్ ( noor bin laden ) రంగంలో దిగారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దేశాన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుండి రక్షించగలరని..ఎన్నికల్లో ఆయన తిరిగి గెలవాలని కోరుతున్నారు.
న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నూర్ బిన్ లాడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ప్రమాదమని ఆమె తెలిపారు. ట్రంప్ గెలిస్తేనే మరోసారి భయంకరమైన 9/11 తరహా దాడులు ( 9/11 attacks ) జరగకుండా ఉంటాయన్నారు. అమెరికా మాజీ అధ్యక్షడు ఒబామా, వైస్ ప్రెసిడెంట్‌గా జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బాగా విస్తరించిందని ఆమె ఆరోపించారు. ఒకవేళ జో బైడెన్ అధ్యక్షుడైతే 9/11 తరహా దాడి మరొకటి అమెరికాపై జరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
డోనాల్డ్ ట్రంప్ తన హయాంలో ఉగ్రవాదుల్ని నిర్మూలించడం ద్వారా అమెరికాను ఉగ్రదాడుల్నించి రక్షించగలిగారని నూర్ తెలిపారు. 2015లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటి నుంచే తాను ట్రంప్ కు అభిమానిగా మారానన్నారు. Also read: Russia’s Vaccine: పంపిణీకు..వ్యాక్సినేషన్ కు సిద్ధం