Covid19 Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పేరేంటో తెలుసా?
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) విషయంలో ఇప్పడు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ) అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ధర నిర్ణయమైంది. ఇప్పుడు పేరు కూడా ప్రకటితమైంది. ఆ పేరేంటో తెలుసా..
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) విషయంలో ఇప్పడు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ) అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ధర నిర్ణయమైంది. ఇప్పుడు పేరు కూడా ప్రకటితమైంది. ఆ పేరేంటో తెలుసా..
ప్రతి వస్తువుకూ ఓ బ్రాండ్నేమ్ ఉంటుంది. ముఖ్యంగా మందుల విషయంలో. అదే ఆ మందుకు ఒక గుర్తింపు తెస్తుంది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా ( Oxford university-Astrazeneca ) అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుందని ఇప్పటికే సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) ప్రకటించింది. ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ బ్రాండ్‌నేమ్ ( Vaccine Brand name ) కూడా నిర్ధారితమైంది. ఆ పేరు కోవిషీల్డ్ ( Covishield ) . Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే
ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ (Covishield ) ను ఉత్పత్తి చేసి, సరఫరా చేయడానికి ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute of India ) తో ఒప్పందమైన విషయం తెలిసిందే. కోవిషీల్డ్ ఈ యేడాది నవంబర్-డిసెంబర్ నాటికి 3 వందల మిలియన్ డోసులు ( 300-400 million Doses ) ఉత్పత్తి పూర్తవుతుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూణావాలా ( Serum CEO Adar Poonawalla ) స్పష్టం చేశారు. మిగిలింది 2021 తొలి క్వార్టర్ ( 2021 First Quarter ) కు అంటే మార్చ్ నాటికి అందిస్తామన్నారు. ఈ వ్యాక్సిన్ ధర దాదాపు వేయి రూపాయలుంటుందని కూడా సీఈవో అదార్ స్పష్టం చేశారు. Also read: Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం