Pakistan’s Supreme grilled prime minister Imran Khan: పాకిస్థాన్​లోని పెషావర్​లో 2014లో జరిగిన ఊచకోతకు సంబంధించిన కేసులో పాక్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్​పై ఆ దేశ సుప్రీం కోర్టు (PM Imran Khan) పశ్నల వర్షం కురిపించింది. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న స్వయంగా కోర్టుకు హాజరయ్యారు ఇమ్రాన్​ ఖాన్​. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కేసు..


2014లో పెషనవర్​లో ఆర్మీ సైనిక పాఠశాలలో ఆరుగురు ఉగ్రవాదులు మారణహోమం (Peshawar attacks) సృష్టించారు. 132 మంది చిన్నారులను పొట్టనబెట్టుకున్నారు. ఇందులో మొత్తం దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారు.


 తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) ముష్కరులు ఈ ఊచకోతకు పాల్పడ్డారు.


Also read: Security Council: ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, సవాళ్లపై ఢిల్లీలో ముగిసిన భద్రతా సదస్సు


Also read: Covid19 Update: రెండేళ్లలో 25 కోట్లమందికి కరోనా వైరస్, హాట్‌స్పాట్‌లు ఆ దేశాలే


బాధితుల ఆగ్రహం..


ఈ దారుణ మారహోమానికి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇందుకు కారణమైన వాళ్లను గుర్తించలేకపోయిందని బాధిత కటుంబాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు గత నెల ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాటిని కూడా ప్రభుత్వం అమలు చేయలేదు.


దీనితో బుధవారం మరోసారి విచారణ చేప్పట్టిన న్యాయస్థానం.. ఇమ్రాన్​ ఖాన్​ సర్కార్​పై (Pak Supreme court fire on Imarn Khan) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నేరుగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కొన్ని గంటల్లోన హాజరైన ఇమ్రాన్ ఖాన్​పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.


అధికారంలో ఉండి.. ఆ దోషులతో చర్చలు జరుపుతున్నారా? అని నిలదీసింది.


Also read: Malala Weds Asser Pics Viral: యాసిర్‌తో నోబుల్ బహుమతి గ్రహీత మలాలా పెళ్లి, ట్రెండ్ అవుతున్న ఫోటోలు


Also read: Paris Catacombs: పారిస్‌లో భయం గొలిపే మృతదేహాల గోడ, గోడ నిండా శవాలే


ఇమ్రాన్ కప్పిపుచ్చే ప్రయత్నం..


కోర్టు విచారణలో ప్రభుత్వ తప్పిదాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు ఇమ్రాన్​ ఖాన్​. బాధితులకు ఇప్పటికే నష్టపరిహారం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. బాధితులకు కావాల్సింది నష్టపరిహారం కాదని.. న్యాయమని స్పష్టం చేసింది. ప్రధాని ఇలా నష్టపరిహారం గురించి మాట్లాడటం సరికాదంటూ సూచించింది.


మరోవైపు ఇమ్రాన్​ ఖాన్​.. దేశంలో డ్రోన్​ దాడులు సహా ఇతర  విషయాల గురించి కూడా తెలుసుకోండి అంటూ కోర్టులో వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఒక దేశ ప్రధానిగా ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలిసి ఉండాలని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇంత వరకు జరిగిన.. దర్యాప్తు, తీసుకున్న చర్యలపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిది సుప్రీం కోర్టు. 


Also read: Illegal drugs trade: ఆఫ్గన్‌లో యథేచ్చగా ఓపియం సాగు.. గత్యంతరం లేదంటున్న రైతులు..


Also read: Gold Mine Collapse: బంగారు గని కూలి...18 దుర్మరణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి