PM Modi US Tour: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఆమె గెలుపు చారిత్రాత్మకం
Modi US tour: అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను కలిసిన ప్రధాని, మీ గెలుపు ఒక చారిత్రాత్మకమని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi US Tour: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మొదటి రోజు అమెరికాలోని టాప్ గ్లోబల్ కంపెనీల సీఈఓలతో (America Top Global Companies) సమావేశమయ్యారు. రెండో రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris)తో భేటీ అయ్యారు. ఈ సమావేహంలో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాల పై చర్వహించిన ప్రాధాని, కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)లో అమెరికా అందించిన సహాయానికి కృతఙ్ఞతలు తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ (Kamala Harris) గెలవటం ఒక చారిత్రాత్మకమని మరియు ప్రపంచ దేశ మహిళలకు ఒక స్ఫూర్తి దాయకం అని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (America President Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) నాయకత్వంలో భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Gang Rape: మహారాష్ట్రలో ఘోరం.. బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం!
ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యకురాలు కమలా హారిస్ ను భారత పర్యటను ప్రధాని మోదీ ఆహ్వానించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ... భారత్ పై ప్రశంశల వర్షం కురిపించారు.." కరోనా ప్రారంభ దశలో భారత్ అన్ని దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసింది. అమెరికా కు భారత్ ఒక ప్రత్యేక భాగస్వామి అని, కరోనా మహామ్మారి గుప్పెట్లో ప్రపంచ దేశాలు నలిగిపోతుంటే భారత్ ముందుండి ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయటం ప్రశంసనీయమని. కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) సమయంలో భారత్ కు తమ భాగ్యతగా వ్యాక్సిన్ సరఫరా చేశామని" ఆమె పేర్కొన్నారు.
"భారత్ లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ కొనసాగుతుంది, త్వరలోనే ఇరు దేశాల మధ్య వ్యాక్సిన్ సరఫరాను తిరిగి ప్రారంభిస్తామని అమెరికా ఉపాధ్యకురాలు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్యా వ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వీటిని కాపాడుకోవటం మన అందరి భాద్యత అని" కమలా హారిస్ పేర్కొన్నారు.
Also Read: Insomnia: నిద్రలేమికి దూరంగా ఉండాలంటే ఇలా చేయండి మరి
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని బిజీగా ఉన్నారు. ఈ రోజు (సెప్టెంబరు 24) అమెరిజా అధ్యక్షుడు జో బైడెన్ (America President Joe Biden)తో భేటీ అవ్వనున్న ప్రధాని, అప్ఘానిస్తాన్ (Afghanistan) దేశంలో పరిస్థితులు, ఉగ్రవాదం(Terrorism), చైనా ఆధిపత్యం (China), భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపడే విషయాల గురించి చర్చించనున్నారు.
ఈ సమావేశం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ (New York) నగరానికి వెళ్లి, రేపు (సెప్టెంబరు 25) ఐక్యరాజ్య సమితి (United Nations) సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. భారత కాలమాన ప్రకారం, సెప్టెంబర్ 26న ఢిల్లీకి మోదీ చేరుకోనున్నారు.
Also Read: Breaking news: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook