TS ICET Results 2021: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ ఫలితాలు(TS ICET Results 2021) విడుదలయ్యాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది అగస్టు 19, 20వ తేదీల్లో మూడు సెషన్‌లలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.inను చూడవచ్చు.
ఐసెట్ ఫలితాల్లో 90.09 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్(Hyderabad)కు చెందిన లోకేశ్ మెుదటి ర్యాంకు సాధించాడు. సాయి తనూజ(హైదరాబాద్) రెండో ర్యాంకు, నవీనక్షంత (మేడ్చల్) మూడో ర్యాంకు, రాజశేఖర చక్రవర్తి (మేడ్చల్) నాలుగో ర్యాంకు, ఆనంద్‌పాల్(కృష్ణా జిల్లా) ఐదో ర్యాంకు కైవసం చేసుకున్నారు.
తెలంగాణ, ఏపీ నుంచి 56,962 మంది అభ్యర్థులు పరీక్ష(Exam)కు హాజరయ్యారు. 200 మార్కులకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 25 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. అంటే కనీసం 50 మార్కులు సాధించాలన్నమాట.
Also Read: జూబ్లీహిల్స్ లో దారుణం: ఫుడ్ కోర్ట్ వాష్ రూంలో సెల్‌ఫోన్ పెట్టి....వీడియోలు రికార్డింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook