Kabul Airport Attack: "దాడికి కారణమైన వారిని వదిలిపెట్టబోము": జో బైడెన్

కాబుల్ లో రెండు వేరు వేరు చోట్ల జరిగిన బాంబ్ పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు భావోద్వేకానికి గురయ్యాడు. దాడికి కారణమైన వారిని వదలబోమని మండిపడ్డారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 10:52 AM IST
  • కాబుల్ ఎయిర్ పోర్ట్ దాడిని ఖండించిన బైడెన్
  • కారణమైన వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్
  • తరలింపు ప్రక్రియ కొనసాగుతుందన్న బైడెన్
Kabul Airport Attack: "దాడికి కారణమైన వారిని వదిలిపెట్టబోము": జో బైడెన్

ప్రపంచ దేశాలు అనుకున్నదే జరుగుతుంది.. ఆఫ్ఘానిస్తాన్ (Afghanisthan)లో నిన్న జరిగిన జంట పేలుళ్ల కారణంగా దాదాపు 60 మందికి పైగా చనిపోగా, 150 మందికి పైగా గాయపడ్డారు, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  అమెరికా (America) తన బలగాలను తాలిబన్ల (Taliban) సాయంతో తిరిగి పంపిస్తుండగా "ఐసిస్‌ ఖోరసాన్‌" (Islamic State of Iraq and the Levant) గ్రూపు మానవ బాంబుతో విరుచుకు పడింది.

ఈ ఘటన ద్వారా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాబుల్ ఎయిర్ పోర్ట్ (Kabul Airport blast) దగ్గర జరిగిన జంట పేలుళ్లపై అమెరికా అధక్షుడు జో బిడెన్ (Joe Biden) ప్రసంగిస్తూ భావోద్వేకానికి గురయ్యాడు. 

Also Read: Exclusive Photos: కాబుల్ విమాశ్రం వద్ద భారీ పేలుళ్లు...పదుల్లో మృతులు, వందల్లో క్షతగాత్రులు

కాబుల్ ఎయిర్ పోర్ట్ లో పేలుళ్ల అనంతరం గురువారం వైట్ హౌస్ (White House) ప్రెస్ మీట్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (American president Joe Biden) "ఈ దాడిని అంతతేలికగా వదిలే ప్రసక్తి లేదు.. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లు కాదు.. భాద్యులేవరైనా వదిలే ప్రసక్తి లేదు.. దాడికి కారణమైన వారిని వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. పేలుడులో మరణించిన అమెరికా సైనికులకు కాసేపు మౌనంగా సంఘీభావం తెలిపి, సైన్యం తరలింపులో తన నిర్ణయాలే వల్ల ఆలస్యం జరిగిందని, జరిగిన నష్టానికి తానే భాద్యత వహించుకున్నాడు. 

తాలిబన్ల సహకారంతోనే సైన్యాన్ని పౌరులను అక్కడి నుండి తరలిస్తామని, ఈ దాడి వలన తరలింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండబోదని, అనుకున్న సమయం వరకు (ఆగస్టు 31) ప్రక్రియ పూర్తి అవుతుందని బిడెన్ పేర్కొన్నాడు. 

ఈ జంట పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు గాయపడగా, 18 మంది గాయపడ్డారు. వీరితో పాటు చిన్న పిల్లలు, ఆఫ్ఘన్ ప్రజలు మాత్రమే కాకుండా తాలిబన్లు కూడా గాయపడ్డారు. ఇదిలా ఉంటే..గ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్‌ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ అబ్బే గేట్‌ వద్ద మరియు బారోన్‌ హోటల్‌ వద్ద మరో బ్లాస్ట్ జరగడం విశేషం.

Also Read: Sea Disappeared: విచిత్రం: ఏపీలో రాత్రికి రాత్రే సముద్రం మాయం..ఏం జరిగిందో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

 

Trending News