coronavirus vaccine: మాస్కో: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి పట్టిపీడిస్తూనే ఉంది. అన్నిదేశాల్లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎలాగైనా కరోనాకు చెక్ పెట్టేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్‌ను కనుగునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా (Russia) కు చెందిన సెచెనోవ్ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా మానవులపై కరోనావైరస్ వ్యాక్సిన్ మొట్టమొదటి క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ ఆదివారం వెల్లడించారు.  Also read: ఆ న్యూమోనియాకు కరోనా వైరస్ కారణం: డబ్ల్యూహెచ్‌వో


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ 18న యూనివర్సిటీ వ్యాక్సిన్ మొదటి క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించిందని ఆయన చెప్పారు. మొదటి వాలంటీర్ల బృందం సభ్యులు బుధవారం డిశ్చార్జ్ అవుతారని,  రెండో బృందం సభ్యులు జూలై 20న డిశ్చార్జ్ అవుతారని తారాసోవ్ తెలిపారు.  అయితే ఈ వ్యాక్సిన్‌ను రష్యాలోని గమలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసింది. ఇదిలాఉంటే.. ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించిన రెండు వాలంటీర్ల బృందాల రోగనిరోధక ప్రతిస్పందన వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. Also read: COVID-19: ఇక కరోనా ఉగ్రరూపం: WHO


సెచెనోవ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాపికల్, వెక్టర్-బొర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ మాట్లాడుతూ.. ఈ టీకా భద్రత మార్కెట్లో లభించే ఇతర ఔషధాల భద్రతకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రాణాళికలను ఇప్పటికే రూపొందిచినట్లు వెల్లడించారు. 
ఇదిలాఉంటే.. ఈ టీకా వాణిజ్య ఉత్పత్తి దశలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందనే దానిపై మరింత సమాచారం ఇవ్వలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 21 కోవిడ్ వ్యాక్సిన్‌లు కీలక పరీక్షల్లో ఉన్నాయి. Also read: 
తొలిసారిగా మాస్క్ ధరించిన డొనాల్డ్ ట్రంప్