కరోనా వైరస్ ( corona virus )  మహమ్మారిని అదుపు చేయడంలో భాగంగా రకరకాల మందులు వినియోగిస్తున్నారు. కొన్ని మందులు సత్ఫలితాలనిస్తుంటే మరికొన్ని వికటిస్తున్నాయి. ఓ మందు విషయంలో డోనాల్డ్ ట్రంప్ ( Donal trump ) అనాలోచితంగా వ్యవహరించిన తీరుకు ఫలితం పెద్ద ఎత్తున ప్రాణనష్టం మిగిల్చిందనేది ఆ అధ్యయనం చెబుతున్న మాట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ కు మందుగా ఓ దశలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ( Hidroxy chloroquinine HCQ ) వాడకంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) హెచ్చరించినా పరిస్థితి కూడా ఉంది. కరోనా రోగుల్లో కొంతమందికి ముఖ్యంగా లక్షణాలు అంత సివియర్ గా లేని దశలో ఇవ్వవచ్చని కొందరి ఆలోచనగా ఉండింది. అదే సమయంలో ఎందుకో తెలియదు గానీ ఈ మందు అంటే హెచ్ సీ క్యూ ( HCQ ) పై అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ( America president Donald trump ) గట్టిగా వాదనకు దిగారు. గొడవ చేసి మరీ భారత్ నుంచి పెద్దమొత్తంలో ఈ హైడ్రోక్సీ క్లోరోక్వీన్ ను దిగుమతి చేసుకున్నారు. 


అయితే కేవలం ఈ మందు వాడటం కారణంగా మొదటి ఆరు నెలల్లో 293 మంది అమెరికన్లు చనిపోయారని మిల్వాకీ జర్నల్ సెంటినెల్ ( Milwaukee journal sentinel ) చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA )  వెల్లడించిన సైడ్ ఎఫెక్ట్స్ ఆధారంగా చనిపోయినవారి సంఖ్యపై ఈ అధ్యయనం సాగింది. వాస్తవానికి ఈ డ్రగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నప్పటికీ...దీనివల్ల కోల్పోయేదేదీ ఉండదని ట్రంప్ ( Trump ) అప్పట్లో వాదించారు. అయితే ఈ మందును గుండె జబ్బులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు వాడకూడదు. ట్రంప్ నిర్ణయం ఫలితంగా మార్చ్ నెలలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ( HCQ ) వినియోగం ఒక్కసారిగా 2 వేల శాతం పెరిగింది. దాంతో ఈ ఏడాది మొదటి ఆరునెలల్లోనే 293 మంది మరణించారు. Also read: Covid19 vaccine: వచ్చినా అంత సమర్ధవంతంగా పనిచేయదా?