కోవిడ్ 19 వైరస్ వ్యాక్సిన్ ( Covid 19 vaccine ) కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ వస్తేనే మహమ్మారి నుంచి రక్షణ ఉంటుందనేది అందరి భావన. అయితే అమెరికన్ నిపుణులు చెబుతున్నది వింటే పూర్తిగా నిరాశ కలగకమానదు.
కరోనా మహమ్మారి ( Corona pandemic ) నుంచి రక్షణ పొందడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే అన్ని అగ్రదేశాలు వ్యాక్సిన్ పరిశోధనల్లో తలమునకలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ( Dr Anthony Fauci ) చెప్పింది వింటుంటే ఆందోళనతో పాటు నిరాశ కలుగుతుంది. కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కు వ్యాక్సిన్ వచ్చినా సరే అది అంత సమర్ధవంతంగా పనిచేయదని ఆయన అంటున్నారు. వ్యాక్సిన్ ఎఫికసీ ( vaccine efficacy ) కేవలం 50-60 శాతం మాత్రమే ఉంటుందంటున్నారు. అందుకే మహమ్మారిని అదుపు చేయడానికి మరిన్ని ప్రజారోగ్య చర్యలు అవసరమవుతాయని చెబుతున్నారు. Also read: WHO: కరోనావైరస్ పుట్టుక తెలుసుకోవడానికి WHO టీమ్ ఏం చేసిందో తెలుసా ?
ఎందుకంటే కోవిడ్ 19 వైరస్ ఎప్పటికప్పుడు రూపం మార్చుకోవడం, ఒక్కోచోట ఒక్కో రకంగా ఉండటం, కొత్త కొత్త లక్షణాలు వెలుగుచూస్తుండటంతో పరిశోధన పూర్తిగా జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్ ను అత్యవసరంగా తెచ్చేందుకు ప్రయత్నం జరుగుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. వ్యాక్సిన్ సమర్ధత ఏంటనేది ఇంకా తెలియదని, కనీసం 75 శాతం పనిచేస్తే బాగుంటుందని డాక్టర్ ఫౌసీ తెలిపారు. బ్రౌన్ విశ్వవిద్యాలయం ( Brown university ) నుంచి నిర్వహించిన ఓ వెబ్ నార్ లో ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు.
అందుకే మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజికదూరాన్ని పాటించడమనేది ఇంకా చాలాకాలం కొనసాగించాలంటున్నారు. వ్యాక్సిన్ అధ్యయనాలన్నీ ఈ ఏడాది చివర్లో మాత్రమే కచ్చితమైన డేటా ఇవ్వగలవన్నారు. Also read: Moderna Vaccine: ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్