అమెరికా ( America ) లో అసలేం జరుగుతోంది. కరోనా మహమ్మారి భయంకర రూపం దాల్చనుందా ? రానున్న మూడు వారాల్లో ఏం జరగనుంది ? ఆ దేశపు ఆరోగ్య సంస్థలు ఏం చెబుతున్నాయి ? నిజంగానే పరిస్థితి అంతలా ఉంటుందా? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) అమెరికాలో మరణ మృదంగం వాయిస్తోంది. రోజురోజుకూ పరిస్థితి చేయి దాటుతోంది. రానున్న మూడు వారాల వ్యవధిలో మరీ భయంకరంగా మారనుందని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్  ( CDC ) అంచనా ఇప్పుడు ఆ దేశాన్ని భయపెడుతోంది. కేవలం వచ్చే మూడు వారాల్లో ఏకంగా 19 వేల మంది ( Corona deaths in coming days ) కరోనా బారిన పడి మరణించవచ్చని సిడిసి అంచనా వేస్తోంది. ఆగస్టు 22 నాటికి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షా 73 వేలకు చేరుకోనుందని అంచనా వేసింది. రానున్న 30 రోజుల్లో సరాసరిన రోజుకు వేయి మంది చనిపోతారని సీడీసీ భావిస్తోంది. అమెరికాలో కరోనా మహమ్మారి కొత్త దశకు చేరుకుందని..ప్రస్తుత పరిస్థితి గతం కంటే భిన్నంగా ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ తెలిపింది.  సంక్రమణ అమెరికాలో చాలా వేగంగా ఉందని..ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందని ఈ సంస్థ చెబుతోంది. అంటే రాబోయే 20 రోజుల్లో ఏకంగా 19 వేల మంది మరణించవచ్చు. Also read: WHO: వ్యాక్సీన్ వస్తుందనే గ్యారంటీ లేదు.. బాంబు పేల్చిన డబ్యూహెచ్ఓ


ఇప్పటికే అమెరికాలో  48 లక్షల మంది కరోనా బారిన పడగా..1 లక్షా 58 వేల 375 మంది మరణించారు. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలోని 34 రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్రమణ రేటు గణనీయంగా పెరిగింది. అటు పరీక్షల సంఖ్య మాత్రం తగ్గుతోంది. ఇది అతి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.