వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( World Health Orgnaisation ) మరో బాంబులాంటి మాట చెప్పింది. ఇటీవలే కరోనావైరస్ (Coronavirus ) ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉండవచ్చని పిడుగులాంటి వార్త చెప్పిన ప్రపంచం ఆరోగ్య సంస్థ ఇప్పుడు అంతకన్నా కలవరపెట్టే వార్త చెప్పింది. ప్రపంచంలోని అనేక దేశాలు కరోనావైరస్ ( Covid-19 ) కు మందు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి అని..కోట్లాది మంది వ్యాక్సిన్ పై ఆశలు పెట్టుకున్నారు అని.. కానీ వ్యాక్సిన్ కోసం వేచి చూడటం కన్నా నివారణ చర్యలు తీసుకోవడంపై ఫోకస్ పెట్టడం మంచిది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘాబ్రియోసిస్ తెలిపారు.
Read This Content Also: What is Silver Bullet : సిల్వర్ బులెట్ అంటే ఏంటి ? WHO ఈ పదం ఎందుకు వాడింది ?
ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా దిగ్గజ ఫార్మా సంస్థలు వ్యాక్సీన్ కోసం ప్రయత్నిస్తున్నాయి అని.. అయితే కోవిడ్-19కు సిల్వర్ బుల్లెట్ ( Covid-19 Silver Bullet ) సమాధానం ఎప్పటికీ ఉండదని తెలిపారు టెడ్రోస్. ప్రస్తుతం సమర్థవంతమైన వ్యాక్సిన్ ( Covid-19 Vaccine ) అందుబాటులో లేదు.. అది భవిష్యత్తులో రాదు అని పిడుగలాంటి వార్త తెలిపారు.. కరోనావైరస్ ను కట్టడి చేయాడానికి టెస్టులు నిర్వహించి కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్కు పెట్టుకోవడం వంటి మనకు తెలిసిన చిట్కాలు పాటిండం ఉత్తమం అని తెలిపారు.
Read This Content Also: రక్షా బంధన్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్
WHO: వ్యాక్సీన్ వస్తుందనే గ్యారంటీ లేదు.. బాంబు పేల్చిన డబ్యూహెచ్ఓ