లెబనాన్ రాజధాని బీరుట్( Explosion in Beirut ) లో జరిగిన పేలుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. మొదటి పేలుడే భారీగా కనిపించడంతో చాలా మంది దాన్ని వీడియో ( Beirut Explosion Video ) తీస్తుండగానే రెండవ పేలుడు సంభవించింది. రెండో పేలుడును చూసి చాలా మంది అణుబాంబు పేలిందేమో అనుకున్నారు. ఎందుకంటే ఆకాశం కనిపించకుండా భారీ పుట్టగొడుగు ఆకారంలో ఎగిసిన దట్టమైన పొగ సాధారణ పేలుడులో కనిపించదు. అయితే ఈ పేలుడుకు బీరుట్ పోర్టులో నిల్వ చేసి ఉన్న 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణం ( Ammonium Nitrate In Beirut Port ) అని లెబనాన్ ప్రధాని హసన్ డియాబ్ తెలిపారు. Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమ్మోనియం నైట్రేట్ అంత ప్రమాదకరమా ? How Dangerous Ammonium Nitrate Is ?


* అమ్మోనియం నైట్రేట్ ను ఎక్కువగా వ్యవసాయ ఎరువుగా వినియోగిస్తారు. ఈ రసాయనం అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. 
* అమ్మోనియం నైట్రేట్ ను విస్ఫోటకాల ( Ammonium Nitrate For Blasting ) కోసం కూడా వాడతారు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం.



WHO: కరోనావైరస్ పుట్టుక తెలుసుకోవడానికి WHO టీమ్ ఏం చేసిందో తెలుసా ?
* అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేసిన ప్రాంతంలో చిన్న నిప్పు రవ్వపడినా ( Ammonium Nitrate Reaction To Fire).. అది భారీ పేలుడు కారణం అవుతుంది. 
* అలాగే అమ్మోనియం నైట్రేట్ విస్పోటనం చెందిన తరువాత వెలువడే వాయువులు ప్రాణాంతకమైనవి.
* అమ్మోనియం నైట్రేట్ వల్ల పేలుడు సంభవిస్తే దాని నుంచి నైట్రోజన్ ఆక్సైడ్ ( Nitrogen Oxide ) , అమ్మోనియం గ్యాస్ ( Ammonium Gas ) కూడా రిలీజ్ అవుతుంది.
Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?
* నిప్పును ఆకర్షించే గుణం అమ్మోనియం నైట్రేట్ కు (  Ammonium Nitrate Attracts Fire ) ఉంటుంది. అంటే పేలుడు గుణాలు అధికం. అందుకే దీన్ని నిల్వ ఉంచే విషయంలో పక్కా నియమాలు ఉన్నాయి. 



* అగ్నిప్రమాదం సంభవించే ఏ అవకాశం లేని ప్రదేశంలో అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు అమ్మోనియా నైట్రేట్ ను నిల్వ చేసే ప్రాంతంలో డ్రైనేజీలు, పైప్స్, ఇలా ప్రవాహక వాహకాలు ఉండకుండా చూసుకోవాలి.  
* ప్రవాహ వాహకాల్లో అమ్మోనియం నైట్రేట్ చేరితో ప్రమాదం రెట్టింపు ఉంటుంది. బీరుట్ లో జరిగిన ప్రమాదంలో ఈ నియమాలన్నీ తుంగలో తొక్కినట్టు ఆ దేశ ప్రధాని స్వయంగా తెలిపాడు.
Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు