Reasons Of Explosion In Lebanon: ప్రపంచాన్ని వణికించిన బీరూట్ పేలుడుకు ( Beirut Blast ) కారణం తెలిసింది. బీరుట్ పోర్టులో జరిగిన ఈ పేలుడుకు భారీ స్థాయిలో అమ్మోనియా నైట్రేటే కారణం అని లెబనాన్ అధికారుల తెలిపారు. బీరుట్ పోర్టులో ఒక గోదాములో ఉన్న 2,750 టన్నుల అమ్మోనియా నైట్రేట్ ( ammonium nitrate) వల్లే ఈ విస్పోటనం జరిగింది అని ఆ దేశ ప్రధాని హసన్ డియాబ్ స్పష్టం చేశారు. సుమారు ఆరు సంవత్సరాలుగా పోర్టులోని గిడ్డంగిలో ఇంత భారీ మొత్తంలో అమ్మోనియా నైట్రేట్ ను నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచారు అని ఆయన తెలిపారు.
నిబంధనలను తుంగలో తొక్కుతూ ఈ రసాయనాలు నిల్వ ఉంచినట్టు తెలిసింది అని లెబనాన్ ( Lebanon ) ప్రధాని హసన్ డియాబ్ తెలిపారు. ఈ పేలుడుకు కారణం అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. పేలుడులో సుమారు వంద మంది మరణించారు. నాలుగువేలకు పైగా ప్రజలు గాయపడ్డారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే