కరోనావైరస్ తో ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోన్న చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది. చైనాలో కొత్త వైరస్ ( China New Virus ) గురించి ఇప్పటికే  WHO హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ వైరస్ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation ) హెచ్చరించింది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో జూలై నెలలో SFTS Virus సుమారు 37 మందికి సోకింది. SFTS Virus వైరస్ వల్ల ఏడుమంది మరణించారని సమాచారం. చైనా అధికారికి మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.  ఈ వైరస్ మనుషలకు సంక్రమిస్తుంది అని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే


ఏంటి ఈ SFTS Virus వైరస్ ? What is SFTS Virus ?
చైనాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న జియాంగ్సు ప్రావిన్స్ లో SFTS Virus వైరస్ ను గుర్తించారు. ముందుగా ఈ ప్రాంతంలో ఒక మహిళకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. పరీక్షలో తేలిన విషయం ఏంటంటే ఆమె శరీరంలో ల్యూకోసైట్స్, ప్లేట్ లెట్స్ బాగతా తగ్గాయి. వైద్యులు ఆమెకు ఒక నెల వైద్యం అందించి డిశ్చార్జ్ చేశారు. 
Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?


SFTS Virus వల్ల ఇప్పటి వరకు సుమారు ఏడు మంది మరణించారట. అయితే ఈ SFTS Virus  కొత్తదేమీ కాదు. చైనాలో దీన్ని 2011 లోనే కనుక్కున్నారు. SFTS Virus పశువుల శరీరానికి అంటుకుని తరువాత మనుషులకు సోకుంతుందట. దీనిని నల్లి వంటి క్రిములు వ్యాపింప చేస్తాయట. కోవిడ్-19 ( Covid-19 )  కి ముందు తరువాత చైనాలో వైరస్ లు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే