Trump versus China: చివరిరోజుల్లో కూడా చైనాకు షాక్..బ్లాక్‌లిస్ట్‌లో షావోమీ
Trump versus China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిజంగా మొండి వ్యక్తి. ఆరు నూరైనా..నూరు ఆరైనా అనుకున్నది చేసి తీరుతారు. పదవీకాలం ముగుస్తున్న చివరి రోజుల్లో సైతం చైనా కంపెనీపై ఆంక్షలు విధించారు.
Trump versus China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిజంగా మొండి వ్యక్తి. ఆరు నూరైనా..నూరు ఆరైనా అనుకున్నది చేసి తీరుతారు. పదవీకాలం ముగుస్తున్న చివరి రోజుల్లో సైతం చైనా కంపెనీపై ఆంక్షలు విధించారు.
చైనా ( China ) తో అమెరికా ( America ) ప్రఛ్చన్న యుద్ధం చెలరేగింది అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) హయాంలోనే. కరోనా వైరస్ కారణంగా ఇరు దేశాల మధ్య వైరం మరింతగా పెరిగింది. పదవి నుంచి దిగిపోడానికి మరో వారం రోజులు కూడా లేదు. అయినా చైనా వెంట పడటం మానలేదు ట్రంప్. పదవి నుంచి దిగిపోయే చివరిరోజుల్లో కూడా చైనా కంపెనీలకు షాక్ ఇచ్చారు. తాజాగా చైనాకు చెందిన 9 కంపెనీలపై ఆంక్షలు విధించారు. స్మార్ట్‌ఫోన్ ( Smartphone ) తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్ ( Xiaomi Corporation ) తో పాటు చైనాలోని మూడవ అతిపెద్ద చమురు సంస్థ సీఎన్‌వోవోసీ, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా, స్కైరీజన్ వంటి 9 కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్ట్ ( America blacklisted 9 chinese companies ) లో చేర్చింది.
చైనా ( China military ) ఈ కంపెనీలకు సంబంధాలు ఉండటమే ఆంక్షలు విధించడానికి కారణమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కంపెనీల్లో అమెరికా పెట్టుబడులేమైనా ఉంటే నవంబర్‌లోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు చర్యలు..అమెరికా దేశ భద్రతకు, ప్రపంచదేశాలకు ముప్పుగా మారనుందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్ తెలిపారు. బ్లాక్‌లిస్ట్ కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎగుమతులు, టెక్నాలజీ మార్పిడి చేయకూడదు. గతంలో డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) 60 చైనా కంపెనీలపై ఆంక్షలు విధించారు.
అయితే చైనా మిలటరీతో తమ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని షావోమీ ( Xiaomi ) తెలిపింది. నిబంధనలకు లోబడి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నామని స్పష్టం చేసింది. కంపెనీ, షేర్ హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతామని ప్రకటించింది.
Also read: Pfizer vaccination: ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని నార్వేలో 23 మంది మృతి ( Donal
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook