Impeachment in America: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అభిశంసన ఎదుర్కొంటున్నారు. దేశ చరిత్రలో రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడు ట్రంప్‌నే. మరి గతంలో ఎవరెవరు అభిశంసన ఎదుర్కొన్నారు..కారణాలేంటి..ఏం జరిగింది అప్పుడు..
డోనాల్డ్ ట్రంప్ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు ముగ్గురు అభిశంసన ఎదుర్కొన్నారు. 1867లో తొలిసారిగా ఆండ్రూ జాన్సన్ అభిశంసన ఎదుర్కొన్నారు. పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించారనే ప్రాధమిక అభియోగంపై 11 అభిశంసన పత్రాలు ప్రవేశపెట్టగా..ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు.
1974 జూలైలో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని..న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారనేది ఆయనపై ఆరోపణ. అయితే అభిశంసనపై ఓటింగ్ జరగడానికి ముందే పదవికి రాజీనామా చేశారు.
ఇక 1999లో అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభిశంసన ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్‌స్కీ స్కాండల్‌లో బిల్ క్లింటన్ అభిశంసన ఎదుర్కొన్నారు. సాక్ష్యాలు బలంగా ఉన్నప్పటికీ తనతో సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ మోనికాపై క్లింటన్ ఒత్తిడి చేశారు. చివరికి ఓటింగ్‌లో మెజార్టీ లేక అభిశంసన తీర్మానం ఓడిపోయింది.
క్యాపిటల్ భవనంపై చొరబాట్లు ప్రేరేపించడం, దాడికి ఉసిగొల్పడం ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిశంసన ఎదుర్కొంటున్నారు. ప్రతినిధుల సభ ఇప్పటికే ఆమోదించి..సెనేట్‌కు పంపింది. సెనేట్‌లో ఆమోదం పొందితే అభిశంసన ద్వారా తొలగింపబడిన తొలి అధ్యక్షుడవుతారు.