ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) సర్వతోముఖాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై నెదర్లాండ్ ప్రభుత్వం, ఇతర కంపెనీలతో 8 ఎంవోయూలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు కరోనా వైరస్ కట్టడి కోసం ప్రత్యేక చర్యలు, మరోవైపు సంక్షేమ పథకాలు. ఇంకోవైపు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ఒప్పందాలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ ( Food processing ) పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నెదర్లాండ్ ప్రభుత్వం ( Netherlands ) , వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం 8 ఎంవోయూ ( 8 MoU ) లు చేసుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై దృష్టి పెడుతూ ఈ ఒప్పందాలు చేసుకున్నారు. వీటిలో ముఖ్యంగా అరటి, టొమాటో, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు ఉన్నాయి. 


ఫుడ్ ప్రాసెసింగ్ పై కొత్త టెక్నాలజీ, కొత్త ఉత్పత్తుల తయారీపై కంపెనీ ప్రతినిధులు ఏపీ సీఎంకు వివరించారు. అరటి పంటకు సంబంధించి ఎన్ ఆర్ సీ బనానా ( NRC Banana Tiruchi ) తిరుచ్చితో ఒప్పందమైంది. మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ప్రమోషన్  తో పాటు క్వాలిటీ టెస్టింగ్ లేబరేటరీలపై ఈ కంపెనీ పని చేస్తుంది. అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి పూణేకు చెందిన ఫ్యూచర్ టెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( Future tech foods pvt ltd ) కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. వాక్యూమ్ టెక్నాలజీ ఉపయోగాల్ని కంపెనీ సీఎంకు వివరించింది. టొమాటో, అరటి ప్రాసెసింగ్ విషయంలో మౌళిక సదుపాయాల కల్పన కోసం బిగ్ బాస్కెట్ ( Big Basket ) తో ఒప్పందమైంది. మరోవైపు మామిడి, చీనీ, మిరప పంటల ప్రాసెసింగ్ లో ఐటీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ కంపెనీతో ఉల్లి ప్రాసెసింగ్ పై ఒప్పందమైంది.


ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ( Netherland government ) తో, ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ఢిల్లీ నుంచి భారత్‌లోని నెదర్లాండ్స్‌ అంబాసిడర్‌ మార్టెన్‌ వాన్‌ డెన్‌ బెర్గ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Also read: Visakhapatnam: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్