Visakhapatnam: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

  విశాఖపట్నం శిరోముండనం కేసులో పోలీసులు చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో నూతన్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Last Updated : Sep 4, 2020, 05:52 PM IST
Visakhapatnam: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

విశాఖపట్నం శిరోముండనం కేసులో పోలీసులు చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో నూతన్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

అంధ్రప్రదేశ్ లో దళితులపై అత్యాచార ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అదే క్రమంలో విశాఖపట్నం ( Visakhapatnam ) లో ఓ దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నూతన్ నాయుడి ఇంట్లో..అతని భార్య ప్రియా మాధురి ( Priya madhuri ) ఈ ఘటనకు పాల్పడినట్టు సీసీటీవీ ఆధారాలున్నాయి. వీటి ఆధారంగా ముందు పోలీసులు ప్రియా మాధురిని అరెస్టు చేశారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి వద్ద నూతన్ నాయుడిని ( Nutan naidu ) కూడా అరెస్టు చేసినట్టు విశాఖపట్నం పోలీస్ కమీషనర్ తెలిపారు. శిరోముండనం జరిగిన రోజున పోలీసులు ఆరు ఫోన్లు సీజ్ చేశారు. కాగా...శిరోముండనానికి ముందు..తరువాత ప్రియా మాధురి భర్త నూతన్ నాయుడితో ఫోన్ లో మాట్లాడినట్టు పోలీసులు చెప్పారు. 

మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేష్ పేరుతో నూతన్ నాయుడి ముగ్గురికి ఫోన్లు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నూతన్ నాయుడిపై కేసు నమోదైంది. 

 

Trending News