AP: ప్రదాని నరేంద్రమోదీ టార్గెట్ గా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు
తిరుమల డిక్లరేషన్ పై వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రదాని నరేంద్రమోదీని టార్గెట్ చేశారు.
తిరుమల డిక్లరేషన్ ( Tirumala Declaration ) పై వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని ( Ap minister kodali nani ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రదాని నరేంద్రమోదీని టార్గెట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది ఆలయ రధం ( Antarvedi temple chariot burnt ) దగ్దమైన తరువాత తిరుమల డిక్లరేషన్ విషయం వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( cm ys jagan ) డిక్లరేషన్ ఇవ్వాలన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ సతీసమేతంగా తిరుమలలో పూజలు చేయాలంటూ కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. ఈసారి నేరుగా ప్రధాని మోదీను టార్గెట్ చేసి మాట్లాడారు.
అయోధ్యతో పాటు ఇతర దేవాలయాలకు ప్రధాని మోదీ ( pm narendra modi )..తన భార్యతో సహా వెళ్లి పూజలు చేయాలని చెప్పాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. మోదీకు చెప్పిన తరువాతే సీఎం జగన్ కు చెప్పాలన్నారు.
తిరుమల వెంకన్నను సైతం చంద్రబాబు నాయుడు ( Chandra babu naidu ) రాజకీయంగా వాడుకుంటున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తిరుమల డిక్లరేషన్ తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని..తిరుమల స్వామి దయతోనే జగన్ సీఎం అయ్యారని నాని చెప్పారు. అసలు రాష్ట్రంలో దేవాలయాల్లో దాడులు, అపశృుతులు సోము వీర్రాజు ( Somu veerraju ) బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతే జరుగుతున్నాయన్నారు. తిరుమల ఆలయం టీడీపీది, బీజేపీది కాదని చెప్పారు. డిక్లరేషన్ అంశాలు ఎందుకు వచ్చాయనే విషయంపై చర్చ సాగాలన్నారు. రాజకీయ ఉద్దేశ్యాలతోనే వివాదాలు చేస్తున్నారన్నారు. Also read: AP High court: గ్యాగ్ ఆర్డర్ సవాలు చేస్తూ పిటీషన్, ఆ న్యాయవాదికి ఆదేశాలు