AP SSC Results 2022: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం.. శనివారం (జూన్ 4) ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో పరీక్షా ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాంకేతికపరమైన ఇబ్బందుల వల్లే పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు చివరి నిమిషం వరకు అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవేవీ సఫలం కాలేదు. ఒకవేళ సాంకేతిక సమస్య పరిష్కారమైతే కొద్ది గంటలు ఆలస్యమైనా ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. అయితే అది సాధ్యపడకపోవడం వల్లే ఫలితాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించడంతో విద్యార్థులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో... ఒక్కసారిగా ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం విద్యార్థులను ఒకింత నిరాశకు గురిచేసింది. నిజానికి ఫలితాలపై ప్రకటన చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ అనుకోని విధంగా చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 


Also Read: YS Sharmila Comments: బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ! కేసీఆర్ మోసాలకు అంతే లేదన్న షర్మిల..


Also Read: Shanidev Vakri 2022 Effect: 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి శనిదేవుడు.. ఈ రాశిల వారికి కష్టాలు తప్పవు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook