AP SSC Results 2022: ఇవాళ (జూన్ 4) ఏపీ ఎస్ఎస్సీ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ఫలితాలను విడుదల చేయనుంది. విద్యార్థులు bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా చివరి రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది పరీక్షల నిర్వహణ సాధ్యపడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎస్ఎస్‌సీ ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 3,02,474 మంది బాలికలు కాగా... 3లక్షల 63 వేల మంది బాలురు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3776 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయి నెల రోజులు కూడా కాకముందే ఫలితాలు విడుదల చేస్తుండటం గమనార్హం. 10 రోజుల్లో 20 వేల మంది టీచర్లతో 40 లక్షల పేపర్లకు స్పాట్ వాల్యుయేషన్ చేయించారు. ఫలితాలను గ్రేడ్స్ రూపంలో కాకుండా మార్కుల రూపంలోనే వెల్లడించనున్నారు. జూలై మొదటి వారంలో లేదా రెండో వారంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పదో తరగతి ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి :
మొదట https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
'ఎస్‌ఎస్‌సీ ఫలితాలు' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
అక్కడ సూచించిన విధంగా మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అంతే.. ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
Also Read: Satyendranath boss: గూగుల్ డూడుల్ గా సత్యేంద్ర నాథ్ బోస్.. భౌతిక, గణిత శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook