YS Sharmila Comments: బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ! కేసీఆర్ మోసాలకు అంతే లేదన్న షర్మిల..

YS Sharmila Comments: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామ ప్రజలతో మాట - ముచ్చట నిర్వహించారు షర్మిల. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Written by - Srisailam | Last Updated : Jun 4, 2022, 11:05 AM IST
  • సత్తుపల్లి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర
  • కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు- షర్మిల
  • బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ- షర్మిల
YS Sharmila Comments: బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ! కేసీఆర్ మోసాలకు అంతే లేదన్న షర్మిల..

YS Sharmila Comments: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామ ప్రజలతో మాట - ముచ్చట నిర్వహించారు షర్మిల. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల.తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా సమస్యలే అన్నారు షర్మిల. సమస్యలు లేని వర్గం తెలంగాణలో లేదన్నారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదనే ఆరోపించారు షర్మిల. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి,డబుల్ బెడ్ రూం ఇళ్లు, రిజర్వేషన్లు, మూడెకరాల భూమి..ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మోసాలే అన్నారు షర్మిల.

బిక్షం ఇచ్చినట్లు బియ్యం ఇస్తూ రేషన్ షాపుల్లో మిగతా అన్ని నిలిపి వేశారని షర్మిల ఆరోపించారు. ఇస్తున్న బియ్యం కూడా తినడానికి పనికిరావని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకుపోయారు కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల. రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే క్షౌరం చేశారని మండిపడ్డారు. డిగ్రీలు, పీజిలు చదివి యువకులు కూలి పనులు చేసుకుంటున్నారని తెలిపారు.కేసీఆర్ పాలనలో అప్పుల పాలై 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల అన్నారు. ఎవరికి అయ్యింది బంగారు తెలంగాణ.. ఇది అప్పుల తెలంగాణ.. ఆత్మహత్యల తెలంగాణ అంటూ ఘాటైన కామెంట్లు చేశారు వైఎస్ షర్మిల. ఇది బాధల తెలంగాణ ..బార్ల తెలంగాణ అంటూ సెటైర్లు వేశారు. ఎవరికి అయ్యింది బంగారు తెలంగాణ..కేసీఆర్ కుటుంబానికి బంగారం అయిందన్నారు.

4 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు..ఆ డబ్బు ఎక్కడకు పోయిందని షర్మిల ప్రశ్నించారు. కమీషన్ల రూపేనా...కేసీఆర్ ఇంట్లోకి పోయిందని అన్నారు. వ్యవసాయానికి వైఎస్సార్ ఇచ్చే పథకాలు అన్ని బంద్ పెట్టి.. ముష్టి 5 వేలు ఇస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో తప్పుడు సంతకం పెట్టి 17 లక్షల ఎకరాలను పడావు పడేలా చేశారని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఉందన్నారు. పెద్దాయన పాలన తెస్తానని మాట ఇస్తున్నా అని హామీ ఇచ్చారు. మహిళ పేరు మీద పక్కా ఇల్లు ఇస్తానన్నారు. ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అంత మందికి 3వేలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో  మళ్ళీ పేదింటి బిడ్డలను ఉచిత చదువులు చదివిస్తానని షర్మిల తెలిపారు.

READ ALSO: CLUB MUSTI PUB: కూకట్ పల్లి క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల అండతోనే గబ్బు?

READ ALSO: Dead Body in JNU: జేఎన్‌యూలో డెడ్ బాడీ కలకలం... చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News