ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఐపీఎస్ అధికారులు ( IPS ) కొందరికి స్థాన చలనమైంది. ముఖ్యంగా కీలక స్థానాల్లో ఉన్నవారిని ఏపీ ప్రభుత్వం మార్చింది. ఏపీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ( Ap intelligence chief ) గా కసిరెడ్డి  వీఆర్ఎన్ రెడ్డిని ( kasireddy vrn reddy ) నియమిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ( ys jagan government ) ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ( Vigilence & Enforcement ) డీజీగా ఉన్న కసిరెడ్డికు ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ ఆర్కే మీనాను ( Vizag cp rk meena ) డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో విశాఖ సీపీగా మనీష్ కుమార్ సిన్హాను ( manish kumar sinha ) నియమించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మరోవైపు ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఐబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ( IB venkateswar rao suspension ) ప్రభుత్వం పొడిగించింది. ఆగస్టు 5 వరకే ఉన్న సస్పెన్షన్ ఉత్తర్వుల్ని మరోసారి పొడిగించారు. సివిల్ సర్వీసెస్ అధికార్ల సస్పెన్షన్ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 


సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో ( Security scam ) ఐబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా భావించి...ఆయన్ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో వైసీపీకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంపై ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించినట్టు  వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏబీ వెంకటేశ్వరరావును పక్కన పెట్టింది.  ఆ తరువాత సెక్యురిటీ పరికరాల కుంభకోణంలో ఆయన పాత్రపై అనుమానాలతో సస్పెండ్ చేసింది. Also read: Janasena Party: రాజోలు ఒకే ఒక్కడు ఏ పార్టీలో ఉన్నట్టు ?