జనసేన పార్టీ ( Janasena party ) ఒకే ఒక్కడు సొంతపార్టీపై చేసిన షాకింగ్ కామెంట్స్ సంచలనం రేపాయి. తన పార్టీ జనసేన బలపడే పార్టీ కాదని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలివి.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక వరప్రసాద్ జనసేన పార్టీకు ఒకే ఒక్క ప్రతినిధి. అయినా ఆ పార్టీపై తరచూ వ్యతిరేక వ్యాఖ్యలతో సంచలనం కల్గిస్తున్నారు. తాను గెలిచిన పార్టీ జనసేన ...ఎన్నటికీ బలపడదని చెప్పారు. కేవలం గాలివాటంగా తానొక్కడినే గెలిచానని స్పష్టం చేశారు. గత కొద్దికాలంగా రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తుండటంపై జనసేన అధిష్టానం ఆయనపై అసంతృప్తిగా ఉంది.
గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించానని...వైఎస్ జగన్, సుబ్బారెడ్డిలను సైతం కలిసినట్టు చెప్పారు. అయితే తప్పనిసరి పరిస్థితుల వల్ల మరొకరికి టికెట్ కేటాయించారన్నారు. దాంతో జనసేన టికెట్ పై సొంతబలంలో గెలిచానని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో అడుగుపెట్టగానే జగన్ ను కలిశానని..వైసీపీ తరపునే పనిచేస్తున్నారని సైతం చెప్పేశారు. ప్రస్తుతం రాజోలు వైసీపీలో తనతో కలిపి మూడు వర్గాలున్నట్టు మరీ చెప్పారు. వర్గాలు పోవాలంటే...జగన్ ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. Also read: Royalaseema lift irrigation: ముగిసిన వాదనలు, రిజర్వ్ లో తీర్పు