ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు తొలిసారిగా  ఆన్‌లైన్ అడ్మిషన్లు ( Onlinel Admissions ) ప్రారంభించింది. మరోవైపు కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా మూతపడిన పాఠశాలల్ని నవంబర్ 2 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. ఆన్‌లైన్ అడ్మిషన్ల ద్వారా పూర్తిగా పారదర్శకత ( Transparency ) పాటిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ( Ap ) లో నవంబర్ 2 నుంచి బడిగంటలు మోగనున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం 5 నెలలు ఆలస్యంగా మొదలవనుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Ap Education minister Adimulapu suresh ) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్‌ 5.0 ( Unlock 5.0 ) మార్గదర్శకాలకు అనుగుణంగా స్కూల్స్, కాలేజీల్ని తెరుస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. నవంబర్ 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక నవంబర్‌ 16వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు మొదలు కానున్నాయి. నవంబర్ 23 నుంచి అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.


విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని.. ప్రతీ విద్యార్థి భౌతిక దూరం పాటించేలా.. తరగతి గదులు ఎప్పటికపుడు శానిటైజ్ చేసే విధంగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు.  ప్రస్తుతానికి కేవలం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహించి..మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేస్తామన్నారు. ఇంటర్ అడ్మిషన్లలో ( Inter Admissions ) సీట్ల కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తెలిపారు. వాస్తవానికి ఇంటర్ అడ్మిషన్లలో ఎక్కడా గందరగోళం గానీ..సీట్ల కొరత గానీ లేదన్నారు. ఇంటర్‌లో 5 లక్షల 83 వేల 580 సీట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇవికాకుండా కొత్తగా 561 కళాశాలల ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చామని తెలిపారు.


కనీస సౌకర్యాలు సైతం కల్పించని కొన్ని కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కల్పించని 613 కళాశాలలపై చర్యలు తీసుకున్నామన్నారు.


నవంబర్ 23 నుంచి 6, 7, 8  తరగతి‌ విద్యార్ధులకు, డిసెంబర్ 14 నుంచి ఒకటి నుంచి అయిదవ తరగతి విద్యార్ధులకు తరగతులు ప్రారంబిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. మార్చి నెలాఖరుకి తొలి సెమిస్టర్, ఆగష్టు నాటికి ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేస్తామన్నారు. బీటెక్‌, బీ ఫార్మా కోర్సులకు సంబంధించి సీనియర్ విద్యార్ధులకు నవంబర్ 2 నుంచి, మొదటి సంవత్సరం విద్యార్దులకు డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంబిస్తున్నట్లు చెప్పారు.


పాఠశాలలకు సంబంధించి పరీక్షల ప్రణాళిక షెడ్యూల్ కూడా రూపొందించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏడాదిలో 180 రోజులు పని దినాలు ఉండేలా ఎకడమిక్ ఇయర్ రూపొందించినట్లు చెప్పారు. Also read: AP: ప్రధాని మోదీకు జగన్ రాసిన లేఖలో ఏముంది ?