Gold Price Today: బంగారం ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఒక్కసారిగా బంగారం ధర భారీగా పెరిగింది. నిన్న తగ్గిందనుకునేలోగా ఇవాళ పెరిగిన రేటు షాక్ ఇచ్చింది. ఒక్కరోజులో బంగారం ధర ఎంత పెరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలలో(Gold Price today)మార్పులు.. కేంద్ర బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వలు.. ఆ బంగారంపై వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపిస్తుంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజూకీ స్వల్పంగా పసిడి ధరలు పెరుగుతూ బంగారం కొనాలనుకునేవారికి షాకిస్తున్నాయి. నిన్న బంగారం తగ్గిందనుకుని సంతోషపడిన బంగారం ప్రియులకు ఇవాళ భారీగా షాక్ కలిగింది. ఒక్కరోజులో ఏకంగా 250 రూపాయల వరకూ బంగారం పెరగడం షాకిచ్చింది. ఫలితంగా మార్కెట్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల 150 రూపాయలకు చేరుకుంది. అదే విధంగా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 45 వేల 9 వందలకు చేరుకుంది. దేశంలోని పలు నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


ఇవాళ అంటే నవంబర్ 17 ఉదయం హైదరాబాద్ మార్కెట్‌లో(Gold Price in Hyderabad)10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల 150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 50 వేల 350కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48 వేల 300కు చేరింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 670కు చేరుకుంది. అదే విధంగా చెన్నై మార్కెట్లో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల 500కు చేరింది. అలాగే ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 48 వేల 360కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 49 వేల 360కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల 150 కాగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర(Gold Price) 50 వేల 350కు చేరుకుంది.


Also read: OnePlus Nord 2 Pac-Man smartphone: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook