Gold Price Today, 7 December 2020:  బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కులో కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు సైతం భారీగా దిగొచ్చాయి. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.200 మేర తగ్గింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,070కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.200 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.45,900 అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఢిల్లీ మార్కెట్‌‌లో డిసెంబర్ ఆరంభంలో పెరిగిన బంగారం ధరలు (Gold Price in Delhi) తాజాగా తగ్గుతున్నాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,650కి పడిపోయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,050కి దిగొచ్చింది.


Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 



గత నెలలో బులియన్ మార్కెట్‌లో భారీగా పతనమైన వెండి ధరలు డిసెంబర్ నెలలోనూ దిగొస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.110 మేర క్షీణించింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.63,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో (Hyderabad) వెండి ధర రూ.3,6,10 మేర పతనమైంది. తాజాగా 1 కేజీ వెండి ధర రూ.63,900లో కొనసాగుతోంది.


Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook