కరోనా వైరస్ (CoronaVirus) కష్ట కాలంలో పెన్షనర్ల కోసం ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ (Pensioner Life Certificate) అందజేసేందుకు ఇకనుంచి పీఎఫ్ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని సూచించింది. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద లైఫ్ సర్టిఫికెట్ అందజేస్తే సరిపోతుందని ఈపీఎఫ్‌వో పేక్కొంది. 



 


పెన్షన్ (Pension) పొందాలంటే సాధారణంగా ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో పింఛనుదారులు పీఎఫ్ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేస్తారు. అయితే ఇటీవల దీనికి ఈపీఎఫ్‌వో చిన్న సవరణ చేసింది. ఏడాదిలో మీకు వీలున్న సమయంలో లైఫ్ సర్టిఫికెట్‌ (‘డిజిటల్‌ జీవన్‌ ప్రమాణ్‌’)ను పీఎఫ్ కార్యాలయంలో అందజేయాలని కరోనా మొదలైన తర్వాత తెలిపింది. తాజాగా మరో మార్పును తీసుకొచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసు, మీ సేవా కేంద్రాలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. పెన్షనర్లు ఇళ్ల వద్ద సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో ఈపీఎఫ్‌వో పేర్కొంది.



 


ఈపీఎస్ పెన్షనర్లు తమ వెంట మొబైల్ ఫోన్, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ నెంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ లాంటివి తమ వెంట తీసుకెళ్లాలని సూచించింది. స్థానిక పోస్టాఫీసులో సంప్రదించడం లేక ఉమాంగ్ యాప్ (UMANG App) ద్వారా చేతి వేలిముద్ర స్కానింగ్‌ను పంపించడంతో లైఫ్ సర్టిఫికెట్ట పంపించవచ్చునని వివరించింది. ప్రస్తుతం సమర్పించే తేదీ నుంచి ఏడాది పాటు లైఫ్ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe