టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మారోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు వ్యాఖ్యాతగా సైతం వ్యవహరిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున, డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కలిసి పనిచేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా శివమణి, సూపర్ సినిమాలు వచ్చాయి. శివమణిలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించిన నాగ్.. సూపర్‌లో దొంగ పాత్రలో కనిపించారు. వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది వీరి ప్రాజెక్టు షురూ అవుతుంది.



కాగా, కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డు పొందిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే పూరీతో నాగ్ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ, అనన్య పాండేలతో ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’ సినిమాతో పూరీ జగన్నాథ్ బిజీగా ఉన్నారని తెలిసిందే.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe