Nikhil Siddharth: పెళ్లి తర్వాత నిఖిల్ క్రేజీ కాంబినేషన్!

విభిన్న కథాంశాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth). ఇటీవల లాక్‌డౌన్ సమయంలో వివాహబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. పెళ్లి తర్వాత నిఖిల్ క్రేజీ హీరోయిన్ కాంబినేషన్‌తో రాబోతున్నాడని టాలీవుడ్ ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.

Last Updated : Oct 11, 2020, 03:47 PM IST
Nikhil Siddharth: పెళ్లి తర్వాత నిఖిల్ క్రేజీ కాంబినేషన్!

గత కొన్నేళ్లుగా విభిన్న కథాంశాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth). ఇటీవల లాక్‌డౌన్ సమయంలో వివాహబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. పెళ్లి తర్వాత నిఖిల్ క్రేజీ హీరోయిన్ కాంబినేషన్‌తో రాబోతున్నాడని టాలీవుడ్ ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘కుమారి 21 F’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘18 పేజీస్’ (18 Pages Movie)గా ఖరారు చేశారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక మెగాఫోన్ సైతం పట్టనున్న విషయం తెలిసిందే.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ మూవీ నిర్మిస్తున్నారు. కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పెళ్లి తర్వాత చేస్తున్న సినిమాలో నిఖిల్, అనుపమ క్రేజీ కాంబినేషన్ కానుందని అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి. మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News