Dwayne Johnson: ‘ది రాక్’ డ్వెయిన్ జాన్సన్ అరుదైన ఘనత

హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్ (Dwayne Johnson) అరుదైన ఘనత సాధించాడు. ‘ది రాక్’గా పేరున్న డ్వెయిన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 200 మిలియన్లకు (Dwayne Johnson Passes 200 Million Followers on Instagram) చేరింది.

Last Updated : Oct 11, 2020, 06:02 PM IST
Dwayne Johnson: ‘ది రాక్’ డ్వెయిన్ జాన్సన్ అరుదైన ఘనత

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్ (Dwayne Johnson) అరుదైన ఘనత సాధించాడు. ‘ది రాక్’గా పేరున్న డ్వెయిన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 200 మిలియన్లకు (Dwayne Johnson Passes 200 Million Followers on Instagram) చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్, కమలా హ్యారిస్‌లకు మద్దతు తెలిపాడు ది రాక్. అప్పటినుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు భారీగా పెరిగారు. గురువారం నాడు 200 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల మార్కు చేరుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ వీడియో పోస్ట్ చేశాడు.

ఈ మార్క్ చేరుకున్న తొలి అమెరికా వ్యక్తిని తానేనని డ్వెయిన్ జాన్సన్ తన పోస్టులో పేర్కొన్నాడు. అయితే నటుడి కన్నా ముందే అమెరికా నుంచి మరో సెలబ్రిటీ ఇటీవల 200 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లను సొంతం చేసుకుంది. అరియానా గ్రాండే అమెరికా సింగర్, లిరిక్ రైటర్, నటి ఈ ఘనత అందుకున్న తొలి అమెరికా వాసి కావడం గమనార్హం. కాగా, పురుషులలో ఈ ఘనతను డ్వెయిన్ జాన్సన్ తన పేరిట లిఖించుకున్నాడు. నిజాలు మాట్లాడాలని, వాస్తవాలు చెప్పడం వల్లే తనను అధికంగా ఫాలో అవుతున్నారని అభిప్రాయపడ్డాడు.

ఓవరాల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయర్లు పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఉన్నారు. అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో 239 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అరియానా గ్రాండే, డ్వెయిన్ జాన్సన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కైలీ జెన్నర్ (నటి, వ్యాపారవేత్త) 197 మిలియన్లు, సెలెనా గొమెజ్ (మోడల్, వ్యాపారవేత్త) 194 మిలియన్ల ఫాలోయర్లతో టాప్5లో ఉన్నారు.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News